ఆది పినిశెట్టి హీరో పాత్రలకు పరిమితం అయిపోకుండా విలన్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ యాక్టర్ అయిపోయాడు. ఎలిజిబుల్ బాచిలర్ అయినా కానీ ఇంతకాలం పెళ్లి చేసుకొని ఆది త్వరలో ఒకింటివాడు కాబోతున్నాడని గట్టి గాసిప్స్ వినిపిస్తున్నాయి. వాటికి ఆజ్యం పోసింది అతనే అనుకోండి.
తన తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులతో జరురుపుకుని ఆ ఫోటోని ఆది షేర్ చేసాడు. పినిశెట్టి కుటుంబ చిత్రపటంలో హీరోయిన్ నిక్కీ గాల్రాని ఉండడంతో ఆమెకు అక్కడేం పని అనే ఆరాలు మొదలయ్యాయి.
ఇద్దరూ కలిసి మలుపు, మరకతమణి సినిమాల్లో నటించారు. అయితే ఈ కరోనా వేళ ఆమె పనిగట్టుకుని అతని తండ్రి పుట్టినరోజు వేడుకకు వెళ్లాల్సిన పనిలేదు. దీనిని బట్టి ఆమె ఆ కుటుంబానికి ఎంత సన్నిహితం అయినదో అర్థమవుతోందని… ఈ ఫోటో ద్వారా ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉన్న ఆది ప్రణయ గాధ బయట పడిందని ప్రచారం జోరందుకుంది. ఈ ఫోటో పెట్టినప్పుడే ఈ విధమయిన రియాక్షన్ ఆది ఊహించే ఉంటాడనుకోండి.
This post was last modified on July 17, 2020 8:42 pm
వారణాసి విడుదల మీద కొత్త ప్రచారాలు మొదలైపోయాయి. ఏప్రిల్ 7 విడుదల సాధ్యం కాదని, అందుకే మగధీర వచ్చిన జూలై…
ఇవాళ రాత్రి నుంచి ఈ నగరానికి ఏమైంది రిపీట్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. విడుదల రేపు అయినప్పటికీ యూత్ ని…
నీటి కోసం.. తెలంగాణ రైతుల జల సమస్య కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో ఎలాంటి సందేహం…
ఒక గ్రామానికి సర్పంచ్. నిజానికి పెద్దగా జీతం ఉండదు. ప్రభుత్వం నుంచి పెద్దగా ఆదరవు కూడా దక్కదు. కేవలం 3…
తెలంగాణ ప్రజల కోసం.. తెలంగాణ సమాజం కోసం అనేక మంది కష్టపడ్డారు. కష్టపడుతున్నారు. అయితే.. వారికి సరైన గుర్తింపు లేకపోవడం..…
ఐపీఎల్‌లో ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ సంపాదన రూ.200 కోట్ల మార్కును దాటింది. 2008లో రూ.6 కోట్లతో మొదలైన అతడి…