ఆ హీరోయిన్ ఖర్చులు ఆరా తీస్తున్న పోలీసులు!

సుశాంత్ సింగ్ రాజపుట్ మరణించక ముందు రియా చక్రవర్తి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. హిందీలో ఒకట్రెండు సినిమాలు చేసిన రియా తెలుగులో తూనీగ తూనీగ సినిమా చేసింది. సుశాంత్ తో లవ్ స్టోరీ గురించి కూడా మీడియాలో అంతగా రాలేదు. అతని ఆత్మహత్య తర్వాత మాత్రం రియా చక్రవర్తి హాట్ టాపిక్ అయింది.

చాలామంది సుశాంత్ అభిమానులు… అతని బలవన్మరణానికి కారణం ఈమె అని నమ్ముతున్నారు. పోలీసులు కూడా రియాకి క్లీన్ చిట్ ఇవ్వలేదు. సుశాంత్ తో రిలేషన్ లో ఉన్నపుడు ఆమె ఖర్చుల గురించి ఆరా తీస్తున్నారు. మరి దాని ద్వారా వాళ్ళు తెలుసుకునేది ఏమిటో ఇంకా క్లారిటీ లేదు.

పలుమార్లు రియాను విచారించిన పోలీసులు ఆమెను మళ్ళీ మళ్ళీ గుచ్చిగుచ్చి ఆరాలు అడుగుతున్నారు. అసలే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో చిరాకులో ఉన్న ఆమెను సుశాంత్ అభిమానులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమని, లేదా రేప్ చేసి చంపించేస్తామని బెదిరిస్తున్నారు. అలాంటి వాళ్ళమీద యాక్షన్ తీసుకోవాలని ఆమె సైబర్ పోలీసులను కోరింది.