అక్కినేని ఫ్యాన్స్ కు గత ఆరేడు నెలలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవు. బంగార్రాజు సూపర్ హిట్ తర్వాత చైతుకి వరసగా లాల్ సింగ్ చద్దా, థాంక్ యు రెండు డిజాస్టర్లు పడ్డాయి. నాగార్జునకు ది ఘోస్ట్ కనీస ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అఖిల్ ఏజెంట్ తాలూకు అప్డేట్స్ లేక అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని అయోమయంలోకి నెట్టేసింది. చివరి దశ షూటింగ్ అయితే జరుగుతోంది కానీ ఫిబ్రవరి శివరాత్రి పండక్కు రావడం అనుమానమే. ధమ్కీ లాంటి బడ్జెట్ సినిమాలే చాలా ప్లాన్డ్ గా ఆ డేట్ ని లాక్ చేసుకున్నప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ ఏజెంట్ ఇంకెంత అడ్వాన్స్ గా ఉండాలో వేరే చెప్పాలా.
వీటి సంగతలా ఉంచితే నాగ్ కు బిగ్ బాస్ సీజన్ 6 ఫలితం మరో షాక్ ఇచ్చింది. ముగింపుకు వస్తున్నా సరే గత అయిదు భాగాలతో పోలిస్తే అత్యంత నీరసంగా జరుగుతోంది ఈ ఆరో నెంబరే. పార్టిసిపెంట్స్ ఎంపికతో మొదలుకుని గేమ్ ని డిజైన్ చేయడం దాకా ప్రతిదాంట్లో టీమ్ వైఫల్యం కనిపించింది. మాములుగా సోషల్ మీడియాలో ఎక్కువగా జరిగే డిబేట్లు సపోర్ట్లు ఈసారి మచ్చుకు కూడా కనిపించలేదు. ఏదో అరకొర ట్వీట్లు పోస్టులు తప్ప కౌశల్, రాహుల్ సిప్లిగుంజ్, శివబాలాజీలు ఉన్నప్పటికీ హడావిడి ఏ మాత్రం లేదు. ఇవన్నీ బిగ్ బాస్ 6 ని డిజాస్టర్ వైపు తీసుకెళ్లాయి
అందుకే ఏడో సీజన్ కొనసాగింపుకు నాగార్జున అంత సుముఖత చూపించడం లేదని టీవీ వర్గాల టాక్. ఏ భాషలో అయినా సదరు ప్రోగ్రాంని నిర్వహించే యాంకర్ దీన్ని రోజూ చూడరు. కేవలం వెకెండ్స్ లో బిగ్ బాస్ డైరెక్టర్ ఇచ్చే సూచనలు స్క్రిప్ట్ మేరకు నడుచుకుని ముఖ్యమైన ఫుటేజ్ మాత్రమే చూస్తారు. కానీ ఆడియన్స్ కి మాత్రం వ్యాఖ్యాతలే న్యాయ నిర్ణేతలుగా కనిపిస్తారు. అందుకే నాని నుంచి నాగ్ దాకా ఎలిమినేషన్లకు సంబంధించి కొన్ని నిందలు భరించాల్సి వచ్చింది. హిట్ అయితే వేరే సంగతి కానీ ఇలా ఫ్లాప్ దిశగా వెళ్తున్నపుడు ఇష్టం పోక ఏమవుతుంది. మరి నాగ్ మనసులో ఏముందో.
This post was last modified on December 15, 2022 12:24 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…