రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాలీవుడ్ మూవీ పఠాన్‌కు సంబంధించిన ఒక పాటపై పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బేషారం రంగ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే ఒక రేంజిలో ఎక్స్‌పోజింగ్ చేసింది. దీపికా అందాలు ఆరబోయడం కొత్తేమీ కాదు కానీ.. ఈ పాటలో ఆమె డ్రెస్సింగ్, హావభావాలు, అందాలను ప్రదర్శించిన తీరు వేరే లెవెల్ అన్నట్లే ఉన్నాయి.
మామూలుగా అయితే యూత్ ఇలాంటి వాటిని బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ మధ్య బాలీవుడ్ సినిమాలను సిల్లీ కారణాలు వెతుక్కుని టార్గెట్ చేస్తున్న బాయ్‌కాట్ బ్యాచ్‌కు దీపికా ఎక్స్‌పోజింగ్ ఒక ఆయుధం లాగా మారిపోయింది. ఆమె డ్రెస్సింగ్ గురించి, ఎక్స్‌పోజింగ్ గురించి రెండు రోజులుగా విపరీతంగా ట్రోల్ చేస్తోంది ఆ వర్గం.
ఐతే దీపికను మామూలు వ్యక్తులు ట్రోల్ చేయడం వేరు. కానీ ఈ వ్యవహారంలోకి ఒక మంత్రి ఎంటర్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపి నేత, మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బేషారం రంగ్ పాటలో దీపిక డ్రెస్సింగ్ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పాటలో దీపిక వస్త్రధారణ ఏమాత్రం బాగా లేదని, ఒక డర్టీ మైండ్‌సెట్‌తో ఈ పాటను చిత్రీకరించినట్లు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పాటలోని సన్నివేశాలను, అలాగే దీపిక డ్రెస్సింగ్‌ను కరెక్ట్ చేయాల్సిన అవసరముందని ఆయనన్నారు. అలా చేయని పక్షంలో పఠాన్ సినిమాను మధ్య ప్రదేశ్‌లో రిలీజ్ చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.
ఐతే మంత్రి గారి కామెంట్ మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సినిమాలకు సెన్సార్షిప్ చేసే బాధ్యతను మంత్రులు ఎప్పుడు తీసుకున్నారు.. హీరోయిన్ డ్రెస్సింగ్ మీద మంత్రి కామెంట్ చేయడం ఏంటి అంటూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on December 15, 2022 7:25 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…