నాగ చైతన్య రెండు సినిమాల మధ్య ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. థాంక్యూ షూట్ జరుగుతుండగానే దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన థ్రిల్లర్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి షూట్ కంప్లీట్ చేసేశాడు చైతు. ఎనౌన్స్ మెంట్ కూడా భారీ గా చేశారు. ఇందులో చైతు లుక్ చూసి అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. టీజర్ కూడా వదిలారు. ఇవన్నీ జరిగి రెండు మూడు నెలలు పైనే అవుతుంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకి రైట్స్ ఇచ్చేశారు.
కానీ ఈ సిరీస్ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేని పరిస్థితి. ఇప్పటి వరకు దూత రిలీజ్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. చైతూ వెంకట్ ప్రభుతో చేస్తున్న కస్టడీ షూటింగ్ తో బిజీ అయిపోయాడు. ఇక విక్రం కుమార్ కూడా నెక్స్ట్ సినిమా సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ మధ్యే కొంత రీ షూట్ చేశారని తెలుస్తుంది. బహుశ ఆ కారణం చేతే ఈ సిరీస్ ని హోల్డ్ చేస్తున్నారా ? తెలియాల్సి ఉంది.
ఓటీటీ సంస్థలు సిరీస్ ల విషయంలో ఓ లైనప్ మైంటైన్ చేస్తుంటారు. నెలల గ్యాప్ లో ఒక్కొక్కటి వదులుతుంటారు. కానీ రాబోయే లిస్టు ఇది అంటూ ఓ ప్రీ ఎనౌన్స్ మెంట్ చేస్తుంటారు. కానీ ధూత రిలీజ్ గురించి Amazon నోరు మెదపడం లేదు. పైగా ఎనౌన్స్ చేసి ఇన్ని నెలలవుతుంది. మరి ధూత రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారో ? ఈ సిరీస్ తో చైతూ ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటాడో ?
This post was last modified on December 14, 2022 8:05 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…