Movie News

మరీ ఇంత సైలెన్స్ ఎందుకు ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ లైనప్ అదిరిపోయేలా ఉంది. సాహో , రాధేశ్యాం దెబ్బలకి నెక్స్ట్ చాలా పకడ్బందీగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్.

ప్రశాంత్ నీల్ , బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ , నాగ్ అశ్విన్ , సందీప్ రెడ్డి వంగా ఇలా బెస్ట్ డైరెక్టర్స్ ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ పై ఇటు ఫ్యాన్స్ లో అటు మూవీ లవర్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ వీటి మధ్యలో ప్రభాస్ చేస్తున్న ఓ చిన్న సినిమా మీదే అందరికీ డౌట్. 

మీడియం రేంజ్ హీరోలతో కాన్సెప్ట్ సినిమాలు చేసే మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రెమ్యునరేషన్స్ పక్కన పెడితే బడ్జెట్ చాలా చిన్నదే అని తెలుస్తుంది. హైదరాబాద్ లోనే కొన్ని లోకేషన్స్ లో తీసేస్తున్నారు. ఇటివలే ప్రభాస్ కొందరు యాక్టర్స్ పై ఓ నాలుగు రోజులు షూట్ చేశారు. తాజాగా రెండో షెడ్యుల్ స్టార్ట్ అయింది. ప్రభాస్ కూడా షూట్ లో పాల్గొంటున్నాడు. 

అయితే ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ నుండి కానీ హీరో టీం నుండి కానీ ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. అసలు సినిమా స్టార్టయిన విషయం కూడా చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలియని పరిస్థితి.

మరి ఇంత సైలెంట్ గా ప్రభాస్ ఈ సినిమా షూట్ ఎందుకు చేస్తున్నట్లు ? మారుతీతో ఎందుకు ?అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్ కి కంటెంట్ తో సమాధానం చెప్పాలని, అప్పటి వరకూ సైలెంట్ గా ఉండాలని ప్రభాస్ భావిస్తున్నాడా ? తెలియాల్సి ఉంది.

This post was last modified on December 14, 2022 7:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీను వైట్ల సినిమా మామూలుగా ఉండదట

ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…

46 minutes ago

నవ్వించి ఏడిపించి ఇప్పుడు భయపెడుతున్నారు

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…

2 hours ago

బీఆర్ఎస్ `విజ‌య్ దివ‌స్‌`… ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తొలిసారి `విజ‌య్ దివ‌స్‌` పేరుతో కీల‌క కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న‌(మంగ‌ళ‌వారం) రాష్ట్ర వ్యాప్తంగా…

2 hours ago

గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..

ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…

2 hours ago

నటి రేప్ కేసు – హీరోపై కోర్టు సంచలన తీర్పు

కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…

2 hours ago

అర్ధరాత్రి షోలు…150 కోట్లు… సినిమా హిట్టే

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…

3 hours ago