‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలకు సంగీత దర్శకులను సెట్ చేసుకోవడం ఇబ్బందయిపోతోంది. అతడి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. టాలీవుడ్ సంగీత దర్శకుల్ని ఎంచుకుంటే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న మ్యూజిక్ ఇవ్వగలరో లేదన్న సందేహం. అలాగని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకుందామంటే.. వాళ్లు మన వాళ్ల అభిరుచికి తగ్గ మ్యూజిక్ ఇస్తారో లేదో అని డౌట్.
ఈ సందిగ్ధతతోనే ‘సాహో’ సినిమా రిలీజ్ ముంగిట సంగీత విషయంలో చాలా తర్జన భర్జనలు నడిచాయి. చివరికి వివిధ భాషలకు చెందిన సంగీత దర్శకులతో వేర్వేరుగా పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయించుకున్నారు. ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయింది.
దీని తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ విషయంలోనూ ఇదే సందిగ్ధత నడుస్తోంది. ఈ సినిమా మొదలై ఏడాది దాటినా ఇప్పటిదాకా సంగీత దర్శకుడు ఖరారవ్వలేదు. మొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలితే.. దాని మీద సంగీత దర్శకుడి పేరు కనిపించలేదు. ఈ గందరగోళం ఇంకెంతో కాలం కొనసాగితే బాగుండదని సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్‌ను గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఐతే ఆయన ఈ సినిమాకు పని చేయడం సందేహంగానే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయి అయినా సరే.. తెలుగు సినిమా చేయడానికి రెహమాన్ అంతగా ఆసక్తి చూపించరు. ‘సైరా’ సినిమాకు కూడా ఒప్పుకున్నట్లే ఒప్పుకుని తప్పుకున్నారు. ‘రాధే శ్యామ్’ విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఆయన కాదంటే తమన్‌ను ఫిక్స్ చేయాలని చూస్తోందట చిత్ర బృందం. ఇదే నిజమైతే తమన్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ అందుకున్నట్లే.
This post was last modified on July 20, 2020 11:17 am
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…