ఎల్లుండి విడుదల కాబోతున్న అవతార్ 2 ది వే అఫ్ వాటర్ మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ప్రధాన నగరాల్లో రేపు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ల పడబోతున్నాయి. వీటి టికెట్లకు డిమాండ్ మాములుగా లేదు. మిగిలిన షోలకు మరీ భీభత్సమైన పరిస్థితి కనిపించడం లేదు కానీ ఇండియా మొత్తం ఎక్కువ కలెక్షన్ మన తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుందని ఒక అంచనా. నిన్నా మొన్నటి దాకా నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఉన్న సమస్య పరిష్కారం కావడంతో బుకింగ్స్ కు రూట్ క్లియర్ అయ్యింది. ఇక అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టడం ఒకటే మిగిలింది
ఇదంతా బాగానే ఉంది కానీ ఓవర్సీస్ మీడియాకు అవతార్ 2 ప్రత్యేక ప్రీమియర్ ని కొద్దిరోజుల క్రితమే ప్రదర్శించారు. నిన్న ముంబై ఐమ్యాక్స్ లో పరిమితంగా వివిధ రంగాల నుంచి ఆహ్వానింపబడిన సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. స్మార్ట్ ఫోన్స్ అనుమతించకపోవడం లాంటి కఠిన నిబంధనల మధ్య ఈ స్క్రీనింగ్స్ జరిగాయి. వాటినైతే కట్టడి చేయగలిగారు కానీ రివ్యూలను ఆపలేరుగా. అవి కాస్తా చల్లగా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఊహించని విధంగా డివైడ్ టాక్ వినిపించడం మేకర్స్ ని ఖంగారు పెడుతోంది. కొందరు అద్భుతమని కితాబు ఇస్తున్నారు.
మరికొందరు అబ్బే అనుకున్నంత లేదని ఫస్ట్ పార్ట్ నే తిరగమోత వేసి ఎక్కువ గ్రాఫిక్స్ ని జోడించారని పెదవి విరుస్తున్నారు. అందరి నుంచి కామన్ గా వినిపిస్తున్న ఫీడ్ బ్యాక్ అయితే ఒకటుంది. 3 గంటల 12 నిమిషాల నిడివి చాలా ఎక్కువయ్యిందని అరగంట దాటాక బోర్ గా ఫీలయ్యేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరి గంట మాత్రం జేమ్స్ క్యామరూన్ తనలో రియల్ క్రియేటర్ ని బయటికి తీసుకొచ్చి విజువల్ వండర్ తో అదరగొట్టాడని చెబుతున్నారు. ఏది నిజమో ఇంకో 48 గంటల లోపే తేలిపోతుంది. వరల్డ్ వైడ్ 52 వేల స్క్రీన్లలో 16 వేల కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో అవతార్ 2 థియేటర్లలో అడుగుపెట్టనుంది.
This post was last modified on December 14, 2022 3:16 pm
ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఎన్విడియా ఇప్పుడు అనూహ్యమైన వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. సంస్థ మాజీ ముఖ్య…
ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్లు, అత్యాధునిక యుద్ధ విమానాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి కొన్ని ప్రత్యేకమైన ఖనిజాలు అవసరం. వీటి ప్రాసెసింగ్‌లో…
ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా మరో జట్టుకు ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిన…
బాలల దినోత్సవం అంటేనే పిల్లలకు ఎంతో ప్రత్యేకం. ఆరోజు పాఠశాలల్లో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంటుంది. అయితే…
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్పర్సన్ డాక్టర్…
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన…