జ్వాల.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన క్రీడాకారిణి. విష్ణు విశాల్ ఏమో చెన్నై బేస్డ్ సినిమా హీరో. వీళ్లిద్దరూ ఎప్పుడు ఎక్కడ కలిశారో.. ఎలా అభిరుచులు కలిశాయో ఏమో కానీ.. చాలా తక్కువ సమయంలోనే క్లోజ్ అయిపోయారు. ప్రేమలో పడిపోయారు. రిలేషన్‌షిప్ మొదలుపెట్టేశారు. లాక్ డౌన్ వేళ ఒకరినొకరు మిస్సవుతూ తమ విరహ వేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈ ప్రేమికులు.
లాక్ డౌన్ షరతులు సడలించాక ఇద్దరూ కలిశారో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు విష్ణు పుట్టిన రోజుకు చడీచప్పుడు లేకుండా చెన్నైకి ఎగిరెళ్లిపోయి అతణ్ని ఆశ్చర్యపరిచింది జ్వాల.
గురువారమే విష్ణు పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి చెన్నైకి వెళ్లింది జ్వాల. తన పుట్టిన రోజుకు సర్ప్రైజ్ ఇదే అంటూ జ్వాలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోను విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మొదట్లో తమ బంధం గురించి దాపరికం పాటించిన ఈ జోడీ.. ఈ మధ్య అస్సలు మొహమాట పడట్లేదు. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉంది.
వీళ్లిద్దరూ ఇప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు పొందడం గమనార్హం. తన సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల తర్వాత అతడి నుంచి జ్వాల విడిపోగా.. విష్ణు విశాల్ కూడా పెళ్లి తర్వాత కొన్నేళ్లకు విడాకులు పొందాడు. తెలుగులోకి రీమేక్ అయిన భీమిలి కబడ్డీ జట్టు, సిల్లీ ఫెలోస్ లాంటి చిత్రాల మాతృకలతో తమిళంలో పెద్ద విజయాలందుకున్నాడు విష్ణు.
This post was last modified on July 18, 2020 7:56 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…