Movie News

పవన్‌తో హరీష్ షూటింగ్ కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఎనిమిదేళ్లకు వీరి కలయికలో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ రెండేళ్ల పాటు ఈ చిత్రం ప్రకటనలకే పరిమితం అయింది. ఐతే ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమాకు ప్రారంభోత్సవం జరిపారు. ఆదివారం సినిమాకు ముహూర్త వేడుకు నిర్వహించడంతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే కొత్త టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఐతే ఈ సినిమాకు ప్రారంభోత్సవం అయితే జరిపారు కానీ.. ఇప్పట్లో షూటింగ్ ఉండదేమో అని చాలామంది సందేహించారు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ సోమవారం ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. అలా అని ఈ షెడ్యూల్ ఇలాగే కొనసాగుతుందని అనుకుంటే పొరబాటే. ‘ద్వితీయ విఘ్నం’ సెంటిమెంటు కోణంలో ఈ ఒక్క రోజు ఇలా చేసినట్లు చర్చించుకుంటున్నారు.

హరీష్ దర్శకత్వంలో పవన్ సినిమాను అనౌన్స్ చేశాక ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎంతకూ ముందుకు కదల్లేదు. ఒక దశలో ఈ ప్రాజెక్టును పవన్ పక్కన పెట్టేసినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ గత రెండు వారాల్లో అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. ఈ ప్రాజెక్టు లైన్లోకి వచ్చింది. కాకపోతే ముందు అనుకున్న కథను పక్కన పెట్టి ‘తెరి’ రీమేక్‌ను పట్టాలెక్కిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమన్నది తెలియడం లేదు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కథ విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నదే పవన్ ఆలోచన అట. ఐతే తర్వాత పవన్ మనసు ఎలా మారుతుందో.. ఈ సినిమా చిత్రీకరణ ఎంత మేర సజావుగా సాగుతుందో తెలియడం లేదు. ఇంతకుముందు అనుభవాలు ఈసారి పునరావృతం కాకుండా.. రెండో రోజు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి అంతా సానుకూలంగా జరగాలన్న సెంటిమెంటుతో చిత్ర బృందం ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on December 12, 2022 9:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

2 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

10 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

13 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

14 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

14 hours ago