‘హిట్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శైలేష్ కొలను. తొలి సినిమా అన్న ఫీలింగే రానివ్వకుండా చాలా పకడ్బందీగా ‘హిట్’ చిత్రాన్ని తీర్చిదిద్ది ప్రశంసలు అందుకున్నాడు. హాలీవుడ్ థ్రిల్లర్ చిత్రాల స్ఫూర్తి ఉండొచ్చు కానీ.. చాలా స్పష్టతతో, ఉత్కంఠభరిత మలుపులతో ఈ సినిమాను నడిపించిన తీరు అందరినీ మెప్పించింది.
అన్ సీజన్లో రిలీజ్ కావడం వల్ల బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకోలేదు కానీ.. డీసెంట్ అనిపించింది. అమేజాన్ ప్రైంలో ఈ సినిమాను పెద్ద ఎత్తున చూశారు. ఈ చిత్రం బాలీవుడ్ వాళ్లనూ మెప్పించింది. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు.
రాజ్ కుమార్ రావు లాంటి టాలెంటెడ్ నటుడు హిందీ ‘హిట్’లో హీరోగా నటించబోతున్నాడు. ఆ చిత్రాన్ని కూడా శైలేషే డైరెక్ట్ చేయబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ‘హిట్’ను తెలుగులో మాదిరే హిందీలో కూడా ఒక ఫ్రాంఛైజీ లాగా తీయబోతున్నట్లు శైలేష్ ప్రకటించాడు. ‘హిట్’ టైటిల్ కిందే ‘చాప్టర్-1’ అని పేర్కొనడం ద్వారా.. ఇది ఫ్రాంఛైజీలాగా నడుస్తుందని ముందే సంకేతాలు ఇచ్చారు.
దీని సీక్వెల్ గురించి కూడా ఇప్పటికే ప్రకటన వచ్చింది. విశ్వక్సేన్‌తోనే తర్వాతి సినిమాను కూడా తీయబోతున్నాడు. అలాగే హిందీలో ఫస్ట్ పార్ట్ రీమేక్ మొదలు కాకముందే అక్కడా ఇది ఫ్రాంఛైజీలా నడుస్తుందని శైలేష్ చెప్పేశాడు. అంటే ముందుగా ‘హిట్’ రీమేక్.. ఆ తర్వాత తెలుగులో ‘హిట్-2’.. ఆపై ‘హిట్-2’ రీమేక్.. ఇలా కనీసం మూడు సినిమాలు శైలేష్ చేతుల్లో ఉన్నట్లు.
‘హిట్’ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే అది హిందీలో కూడా హిట్టయ్యే అవకాశాలున్నాయి. ‘హిట్-2’ తెలుగులో సక్సెస్ అయితే ఈ ఫ్రాంఛైజీలో మరో సినిమా గ్యారెంటీ. ఆ తర్వాత దాని రీమేక్ ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ ఫ్రాంఛైజీతో దర్శకుడి లైఫ్ సెటిల్ అయిపోయినట్లే కనిపిస్తోంది.
This post was last modified on July 17, 2020 9:33 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…