బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన కంగనా రనౌత్.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో ఇంకా అంతగా నిలదొక్కుకోని సమయంలోనే ఆమె తమిళంలో ధూమ్ ధామ్, తెలుగులో ఏక్ నిరంజన్ చిత్రాల్లో నటించింది. ఆ రెండూ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
ఐతే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత, తాను బాలీవుడ్లో పెద్ద స్టార్‌గా ఎదిగాక.. జయలలిత బయోపిక్‌లో నటించింది కంగనా. తలైవి పేరుతో ఎ.ఎల్.విజయ్ రూపొందించిన ఈ సినిమా సైతం కంగనాకు చేదు అనుభవమే మిగిల్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దక్షిణాదిన కంగనాకు అస్సలు కంగనాకు అస్సలు కలిసి రాకపోవడంతో ఇక మళ్లీ ఆమె ఇటు వైపు చూడదనే అనుకున్నారంతా. కానీ ఆమెకు మాత్రం సౌత్ మీద మోజు పోయినట్లు లేదు. ఓ పెద్ద సినిమాలో కీలక పాత్ర చేయబోతోంది.
లారెన్స్ కథానాయకుడిగా సీనియర్ దర్శకుడు పి.వాసు రూపొందిస్తున్న చంద్రముఖి-2లో లీడ్ హీరోయిన్ పాత్రకు కంగనా రనౌత్ ఎంపిక కావడం విశేషం. ఆమె ఇలాంటి సినిమాలో నటిస్తుందని ఎవరూ అనుకోరు. నిజానికి ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు కాజల్ అగర్వాల్‌ను అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లి కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తర్వాత హీరోయిన్ పాత్రకు రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. వాళ్లెవ్వరూ ఖరారు కాలేదు.
ఐతే చివరికి కంగనా రనౌత్‌ను ఈ పాత్రకు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చంద్రముఖికి సీక్వెల్‌గా కన్నడలో, తెలుగులో సినిమాలు తీశాడు పి.వాసు. ఐతే తమిళంలో తీయబోయే సీక్వెల్ భిన్నమైందని తెలుస్తోంది. రజినీకాంత్ వీరాభిమాని అయిన లారెన్స్ ఆయన పాత్రను కొనసాగించబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on December 11, 2022 10:18 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…