నాని నిర్మాణంలో కొత్త దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ సినిమాకు అనుకున్నంత రీచ్ కనిపించలేదు. ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ ఆరేడు కోట్ల షేర్‌తో సరిపెట్టుకుందా సినిమా. ఐతే ‘హిట్’ ఓవరాల్‌గా సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకోవడం ‘హిట్-2’కు ప్లస్ అయింది. దీనికి తోడు వరుస హిట్లతో ఊపుమీదున్న అడివి శేష్ ఇందులో హీరోగా నటించంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇక ‘హిట్-2’ ప్రోమోలు అదిరిపోవడంతో రిలీజ్ ముంగిట హైప్ పీక్స్కు చేరింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు నుంచి అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది ‘హిట్-2’ వారం తిరక్కముందే బ్రేక్ ఈవెన్ అయిపోయిన వరల్డ్ వైడ్ బయ్యర్లందరినీ లాభాల బాట పట్టించింది ‘హిట్-2’. యుఎస్‌లో ఈ చిత్రం మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయగా.. తెలుగు రాష్ట్రాల షేర్ రూ.20 కోట్లకు చేరువగా ఉంది.
హిట్-2కు తొలి వారం అసలు పోటీ అన్నదే లేదు. దీంతో పాటుగా రిలీజైన సినిమాలేవీ అస్సలు నిలబడలేకపోయాయి. ఈ చిత్రానికి రెండో వారం కూడా భలేగా కలిసొచ్చేలా ఉంది. ఈ వీకెండ్లో పేరుకు 17 సినిమాలు రిలీజయ్యాయి కానీ.. అందులో మూణ్నాలుగు చిత్రాలకు మించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. అలా ఆకర్షించిన సినిమాలు వేటికీ కూడా ఆశించిన టాక్ రాలేదు.
అన్నింట్లోకి కొంచెం ఎక్కువ బజ్ తెచ్చుకున్న ‘గుర్తుందా శీతాకాలం’ పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ‘పంచతంత్రం’కు టాక్ బెటర్‌గా ఉంది కానీ.. అది ఒక వర్గం ప్రేక్షకులకే నచ్చే సినిమా. థియేటర్లలో ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించే అవకాశాలు బహు స్వల్పం. ఓటీటీలకు అయితే బాగా ఫిట్ అయ్యే సినిమా ఇది. ఇక విశ్వక్సేన్ ప్రత్యేక పాత్ర పోషించిన ‘ముఖచిత్రం’కు బ్యాడ్ టాక్ వచ్చింది. ఈ మూడింట్లో ఏ సినిమా కూడా థియేటర్లలో పెద్దగా సందడి చేసే అవకాశాలు కనిపించడం లేదు. మిగతా సినిమాల గురించి చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ వారం కూడా అడివి శేష్ సినిమా వసూళ్లు దంచుకోవడం గ్యారెంటీ. ఈ నెల 16న ‘అవతార్-2’ వచ్చే వరకు ఈ సినిమా జోరు కొనసాగబోతోంది.
This post was last modified on December 10, 2022 3:08 pm
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన…
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…