టాలీవుడ్లో పెద్ద సినిమాలు కొంచెం గ్యాప్ ఇస్తే చాలు.. చిన్న సినిమాలు వరుస కట్టేస్తుంటాయి. కొన్ని సందర్బాల్లో మరీ శ్రుతి మించిపోయి ఒకేసారి అరడజను, అంతకుమించి సినిమాలు రిలీజ్ చేసేస్తుంటారు.
ఈసారి మరీ విడ్డూరంగా 17 సినిమాలు ఒకే వీకెండ్లో రిలీజ్ కాబోతుండడం ఒక రికార్డు. ఇంత పెద్ద నంబర్ అనగానే అందులో చాలా వరకు కనీస గుర్తింపు లేనివి.. ఏమాత్రం ప్రేక్షకుల దృష్టిలో పడనివి.. ఏదో రిలీజవుతున్నాయంటే అవుతున్నాయి అనిపించే సినిమాలు చాలానే ఉంటాయి.
వాటి సంగతి పక్కన పెడితే.. ఈ వీకెండ్ మూవీస్‌లో ఒక మూడు సినిమాలు కాస్త బజ్ తెచ్చుకున్నాయి. కొంచెం ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నాయి. అవే.. గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం.
ఇందులో ‘గుర్తుందా శీతాకాలం’ కన్నడలో విజయవంతం అయిన ‘లవ్ మాక్‌టైల్’ ఆధారంగా తెరకెక్కింది. నాగశేఖర్ రూపొందించిన ఈ చిత్రంలో సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్ లాంటి ప్రముఖ తారాగణం ఉండడం.. ప్రోమోలు రొమాంటిగ్గా ఉండడంతో యువ ప్రేక్షకుల్లో సినిమాపై కొంత అంచనాలు ఏర్పడ్డాయి.
సోలో హీరోగా హిట్ కోసం చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న సత్యదేవ్‌కు ఈ చిత్రమైనా లోటు తీరుస్తుందేమో చూడాలి. ఇక చాన్నాళ్లు మేకింగ్‌లో ఉండి, రిలీజ్ కోసం కూడా ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఆంథాలజీ ఫిలిం ‘పంచతంత్రం’ కూడా మంచి ప్రోమోలతో ఆకట్టుకుంది.
ఇందులో బ్రహ్మానందం, స్వాతి సహా చాలామంది పేరున్న నటీనటులే ఉన్నారు. ఈ ఫీల్ గుడ్ మూవీ మీద దాని టీం ఎంతో నమ్మకంతో ఉంది. ఇక ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ రచనలో తెరకెక్కిన ‘ముఖచిత్రం’లో ప్లాస్టిక్ సర్జరీల నేపథ్యంలో స్కాంను థ్రిల్లింగ్‌గా చూపించే ప్రయత్నం జరిగింది.
విశ్వక్సేన్ ప్రత్యేక పాత్ర ఈ సినిమాకు ప్లస్. మిగతా సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేనట్లే. మరి రాశి పరంగా ఘనంగా కనిపిస్తున్న ఈ వీకెండ్ సినిమాల్లో వాసి ఉన్నవి ఏవో ఈ రోజు సాయంత్రానికి తేలిపోతుంది.
This post was last modified on December 9, 2022 10:50 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…