బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్‌లో మిగతా వాళ్లందరిదీ ఒక దారి అయిత.. కమల్.ఆర్.ఖాన్‌ది ఇంకో దారి. సోషల్ మీడియాలో అదే పనిగా స్టార్ హీరోలను, నిర్మాతలను టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్లు చేయడం.. సినిమాల గురించి కూడా సంచలనంగా ఏదో ఒకటి మాట్లాడడం ద్వారా అతను నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాడు. అతణ్ని చాలామంది తిట్టుకుంటూనే తనను ఫాలో అవుతుంటారు. తన పోస్టులు, వీడియోలు చూస్తుంటారు. అలా అతడి ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది.
మిలియన్లలో ఫాలోవర్లు ఉన్న వ్యక్తి కావడంతో అతణ్ని బాలీవుడ్ కూడా విస్మరించలేకపోతుంటుంది. భారీ చిత్రాలను టార్గెట్ చేస్తూ కొన్నిసార్లు అసత్యాలను కూడా ప్రచారం చేస్తుంటాడు కమల్. ఇప్పుడు రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మీదా అలాంటి కామెంట్లే చేశాడు. ఈ సినిమా వల్ల నిర్మాతలకు రూ.200 కోట్లు నష్టం వచ్చిందంటూ అతను స్టేట్మెంట్ ఇచ్చాడు.
2022 సంవత్సరం చివరికి వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది హిట్లు, ఫ్లాపులు అంటూ మీడియా వాళ్లు విశ్లేషించడం మామూలే. కమల్ కూడా అదే పని చేశాడు. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అంటూ లిస్టు ఇచ్చాడు. అందులో ‘బ్రహ్మాస్త’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ను కూడా చేర్చేశాడు. ‘బ్రహ్మాస్త్ర’కు రూ.300 కోట్లు, ‘ఆర్ఆర్ఆర్’కు రూ.200 కోట్లు నష్టం వచ్చిందని పేర్కొన్నాడు. ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో అతను కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పి ఉండొచ్చు కానీ.. ఆ సినిమాకు నష్టం వచ్చిన మాట వాస్తవం. నిర్మాతలు, బయ్యర్ల పెట్టుబడిని అది పూర్తి స్థాయిలో రికవర్ చేయలేదు. అది ఫ్లాప్ అనడంలో సందేహం లేదు.
కానీ ‘ఆర్ఆరఆర్’కు ఎక్కడా నష్టం అన్న మాటే లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఆ చిత్రం చాలా బాగా ఆడింది. భారీ వసూళ్లను తెచ్చుకుంది. ‘బాహుబలి’ స్థాయిలో భారీ లాభాలు తెచ్చి ఉండకపోవచ్చు కానీ.. ఆ సినిమాకు నష్టమైతే లేదు. అది హిట్ మూవీ అనడంలో సందేహమే లేదు. కానీ రాజమౌళిని టార్గెట్ చేస్తే మైలేజీ వస్తుంది కాబట్టే కమల్ ఈ ఎత్తుగడ వేశాడన్నది స్పష్టం.
This post was last modified on December 8, 2022 5:43 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…