Tollywood హీరోలు ఒక్కొక్కరుగా థియేటర్ బిజినెస్‌లోకి దిగేస్తున్నరు ఈ మధ్య. వారిని రంగంలోకి దించుతున్నది ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగే. మహేష్ బాబుతో ఏషియన్ భాగస్వామ్యంలో వచ్చిన ‘ఏఎంబీ సినిమాస్’ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో నంబర్ వన్ మల్టీప్లెక్స్ ఇదే అనడంలో సందేహం లేదు.
దీని తర్వాత Vijay Deverakonda తో మహబూబ్‌నగర్‌లో ఒక మల్టీప్లెక్స్‌ను నిర్మించింది ఏషియన్ సంస్థ. త్వరలోనే Allu Arjun భాగస్వామ్యంలో ఏషియన్ వారి కొత్త Multiplex రాబోతోంది. ఈ సమాచారం ఏడాది కిందటే బయటికి వచ్చింది కానీ.. త్వరలోనే ఆ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ సిటీ సెంటర్ అనదగ్గ అమీర్ పేటలో ఈ Multiplex కమ్ మాల్ నిర్మాణం జరుపుకోవడం విశేషం. హైదరాబాద్‌లో చాలా ఫేమస్ అయిన సత్యం థియేటర్‌ను కొన్నేళ్ల కిందటే పడగొట్టేశారు.
ఆ స్థానంలో ఏర్పాటు చేసిందే ఏఏఏ మల్టీప్లెక్స్ కమ్ మాల్. ఇందులో ఒక ఏ అంటే ఏషియన్ కాగా.. మిగతా రెండు ఏలకు Allu Arjun అని అర్థం. ఇక్కడ ఐదారు స్క్రీన్లు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో ఇటు మల్టీప్లెక్సులు, అటు సింగిల్ స్క్రీన్లను అధునాతనంగా తీర్చిదిద్దుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడంతో ఏషియన్ వాళ్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఏఎంబీతో గచ్చిబౌలి ప్రాంత వాసులకు లగ్జీరియస్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంతో ఏఎంబీ సూపర్ సక్సెస్ అయింది. మరో టాప్ స్టార్ భాగస్వామ్యంతో మొదలైన మల్టీప్లెక్స్ కావడంతో ఇది కూడా ఇంకో లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు. ఇలా హీరోల భాగస్వామ్యంలో మొదలవుతున్న మల్టీప్లెక్సుల్లో వాళ్లు పెట్టుబడిగా పెడుతున్న డబ్బు నామ మాత్రమే. ఈ హీరోల బ్రాండును వాడుకుని ఆ మేర వారికి వాటా ఇస్తోంది ఏషియన్ సంస్థ. ఏఎంబీకి మహేష్ బ్రాండు బాగా ఉపయోగపడింది. ఏఏఏకు Allu Arjun బ్రాండు కూడా అంతే ఉపకరిస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates