ప్రస్తుతం ఇండియా మొత్తంలో ఉత్తమ నటీమణుల జాబితా తీస్తే సాయిపల్లవి పేరు అందులో తప్పకుండా ఉంటుంది. దక్షిణాదిన అంతటా ఆమెకు తిరుగులేని గుర్తింపు ఉంది. కేవలం సాయిపల్లవి అనే పేరు చూసి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య చాలా పెద్దదే. మలయాళం, తమిళం, తెలుగు.. ఇలా పలు భాషల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. కన్నడిగులు సైతం ఆమెను అభిమానిస్తారు.
ఇక సాయిపల్లవి జెండా ఎగరేయాల్సింది ఉత్తరాదినే. ఆమెకు ఇంతకుముందే బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. సినిమాల విషయంలో ఆమె ఎంత చూజీగా ఉంటుందో తెలిసిందే. ఐతే ఎట్టకేలకు సాయిపల్లవి ఓ హిందీ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో సాయిపల్లవి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రణబీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తారట. ముందు ఈ పాత్ర కోసం దీపికా పదుకొనేను అనుకున్నారని.. ఆ తర్వాత కరీనా కపూర్ పేరు కూడా తెర మీదికి వచ్చిందని. కానీ ప్రస్తుత దశలో వాళ్లు ఈ పాత్రకు సెట్ కాదనే ఉద్దేశంతో సాయిపల్లవిని సంప్రదించారని.. భారీ ప్రాజెక్టు కావడం, అందులోనూ సీత పాత్ర కావడంతో సాయిపల్లవి ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ రావణాసురుడి పాత్ర చేస్తాడని కూడా ప్రచారం సాగిస్తున్నారు.
ఈ కాంబినేషన్ అయితే క్రేజీగానే అనిపిస్తోంది కానీ.. ఆల్రెడీ ‘ఆదిపురుష్’ రామాయణం నేపథ్యంలో తెరకెక్కింది.. మరోవైపు అల్లు అరవింద్ రామాయణం నేపథ్యంలో ఓ ప్రాజెక్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి కొత్తగా అదే కథతో ఇంకో సినిమా ఏంటి అన్నదే డౌటు. ప్రస్తుతానికి దక్షిణాదిన సాయిపల్లవి పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు.
This post was last modified on December 7, 2022 7:58 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…