Waltair Veerayya Release Date: రోజురోజుకి రసవత్తరంగా మారుతున్న సంక్రాంతి పందెంలో మరో రిలీజ్ డేట్ ఖరారయ్యింది. మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూసిన వాల్తేర్ వీరయ్య విడుదల తేదీని జనవరి 13కి లాక్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. నిజానికీ ఈ లీక్ వారం ముందు నుందే మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటీ అనూహ్యంగా మారుతున్న పరిస్థితుల్లో ఏదైనా ట్విస్టు ఉంటుందేమోనని అభిమానులు ఎదురు చూశారు. అలాంటిదేమీ లేకుండా ఫైనల్ చేశారు. సో అందరికంటే చివరగా వస్తున్నది చిరంజీవే అవుతారు. 12న వారసుడు, వీరసింహారెడ్డిలు అదే రోజు లేదా 11న తెగింపు రాబోతున్నాయి.
ఇలా చేయడం వల్ల ఓపెనింగ్స్ మీద కొంత ప్రభావంతో పాటు ముందొచ్చినవి థియేటర్లను ఎక్కువగా తీసేసుకుంటాయనే టెన్షన్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయితే పండగ తేదీలు 14, 15 కావడంతో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక ఈజీగా నిలదొక్కుకోవచ్చనేది వీరయ్య హీరో నిర్మాతల ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ వీరసింహారెడ్డికి ఇదే స్పందన వస్తే మాత్రం చిక్కులు తప్పవు. వారసుడు తాలూకు రచ్చ ఇంకా పూర్తి కాలేదు. ఫిలిం ఛాంబర్ విన్నపాలతో పాటు వైజాగ్ తదితర ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లకు స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే లేఖ అందిన నేపథ్యంలో రాబోయే పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.
నిర్మాత దిల్ రాజు వైపు నుంచి కేవలం ఒక న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ తప్ప పూర్తి క్లారిటీ రాలేదు. మీడియాతో నేరుగా మాట్లాడిన రోజు ఒక అంచనాకు రావొచ్చు. ఒకవేళ వారసుడు తెలుగు వెర్షన్ కనక రాజీ పడి విజయ్ మార్కెట్ కు తగ్గట్టు తగ్గట్టు తక్కువ స్క్రీన్లతో సర్దుకుంటే చిరు బాలయ్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరిపడా థియేటర్లు ఉంటాయి కాబట్టి రిలీజ్ డేట్లు అటుఇటు అయినా సమస్య లేదు. ఇంకా పాట షూటింగ్ బ్యాలన్స్ ఉన్న వాల్తేర్ వీరయ్య చిరు శృతి హాసన్ లతో పాటు టీమ్ విదేశాలకు ప్రయాణం కానుంది. జనవరి మొదటివారంలోగా సెన్సార్ పూర్తి చేయనున్నారు.
This post was last modified on December 7, 2022 4:33 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…