టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో బాగా నానుతున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘వారిసు’ తెలుగు అనువాదానికి ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతున్నాడన్న ఆరోపణలను రాజు ఎదుర్కొంటున్నాడు. పండుగలప్పుడు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఉండాలని, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కష్టమని గతంలో వ్యాఖ్యానించి ఇప్పుడు అందుకు భిన్నంగా రాజు వ్యవహరిస్తున్నాడంటూ ఆయన తీరును తప్పుబడుతున్నారు. తెలుగు నిర్మాతల మండలి సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఐతే ఈ వివాదంపై ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో రాజు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. గతంలో ‘పేట’ సినిమా చాలా లేటుగా సంక్రాంతి రేసులోకి రావడం, ‘వారసుడు’ సినిమాకు చాలా ముందే డేట్ ఇచ్చి థియేటర్లు బుక్ చేయడం గురించి వివరణ ఇచ్చాడు. అన్నిటికీ మించి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను రిలీజ్ చేస్తున్న మైత్రీ సంస్థతో తనకు మంచి అండర్‌స్టాండింగ్ ఉందని, వాళ్లకు లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకని ఆయన ప్రశ్నించడంతో వివాదానికి తెరపడినట్లు అయింది. దీని మీద తర్వాత నిర్మాతల మండలి కూడా సైలెంట్ అయిపోవడంతో గొడవ ముగిసిందనే అనుకున్నారంతా.
కానీ ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మళ్లీ అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి, దసరా సీజన్లలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ గత నెల 30వ తేదీన విశాఖపట్నంలో జరిగిన ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించామని, ఈ మేరకు 2017లో జరిగిన తీర్మానం మీదా చర్చ జరిగిందని పేర్కొంటూ వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌కు ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ రాసిన లేఖ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ లేఖను అనుసరించి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ తమ పరిధి వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఎగ్జిబిటర్లకు సూచించినట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాలపై దిల్ రాజు ఎలా స్పందిస్తాడో.. సంక్రాంతికి థియేటర్ల సర్దుబాటు ఎలా ఉండబోతోందో చూడాలి.
This post was last modified on December 7, 2022 2:26 pm
విశాఖపట్నం ఐటీ మ్యాప్పై మరింత బలంగా నిలవడానికి మరో భారీ అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి…
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం…
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు.…
మూడు నెలల కాలంలో అద్భుత విజయాలను సాధించాలని టిడిపి అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి…
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…