Movie News

చిన్న సినిమాకు అంత రిస్క్ ఎందుకు

ఒకపక్క చిరంజీవి బాలకృష్ణ సినిమాలకే తగినన్ని థియేటర్లు దొరుకుతాయా లేదాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంటే విజయ్ వారసుడుకి తోడుగా అజిత్ మూవీ కూడా నేను సైతం అంటూ ఫిక్స్ కావడం ఎగ్జిబిటర్లను ఖంగారు పెడుతోంది. ముఖ్యంగా నాలుగైదు హాళ్లు మాత్రమే ఉండే కొన్ని బిసి సెంటర్లలో ఇదో పెద్ద తలనెప్పిగా మారుతుంది. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు వచ్చే ఓవర్ ఫ్లోస్ ని మిగిలినవి క్యాష్ చేసుకున్నా మళ్ళీ ఆ ఇద్దరి కోసం ప్రేక్షకులు టికెట్లు కొనడం టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత సంక్రాంతి సీజనైనా ఆ హడావిడి సందడి మహా అయితే వారం రోజులకు మించి ఉండదు. ఆలోగానే రాబట్టుకోవాలి.

ఇప్పుడివి చాలవన్నట్టు సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయంని అదే సమయంలో విడుదల చేయాలని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్ణయించుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కొత్త దర్శకుడు అనిల్ తో డీసెంట్ బడ్జెట్ తో చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. అసలు షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందో మీడియాకు తెలియనంత గుట్టుగా పూర్తి చేస్తున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి మేమూ సంక్రాంతికే వస్తామంటే సర్దుబాటు చేయడం అంత ఈజీగా ఉండదు. యువికి డిస్ట్రిబ్యూషన్ లో పట్టు, వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే మల్టీప్లెక్సులు ఉన్నంత మాత్రాన ఇంత రిస్క్ చేయాలా అనేది ప్రశ్న.

ఇదే తరహా ఓవర్ కాన్ఫిడెన్స్ తో దసరా బరిలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లతో పాటు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యంని దించితే ఏం జరిగిందో అందరికీ గుర్తే. పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రం అనవసరంగా కిల్ అయిపోయింది. దెబ్బకు కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో ఓటిటికి ఇచ్చేశారు. అసలే సంతోష్ శోభన్ కి మార్కెట్ లేదు. కనీస ఓపెనింగ్స్ కూడా తేలేడని లేటెస్ట్ డిజాస్టర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఋజువు చేసింది. అదిరిపోయే కంటెంట్ ఉంటే తప్ప ఇతని కోసం జనం థియేటర్లకు రారు. అలాంటప్పుడు చిరు బాలయ్య విజయ్ అజిత్ ల మధ్య నలిగిపోకుండా ఉండగలడా. అఫీషియల్ చేయలేదు కానీ టాక్ అయితే జోరుగా ఉంది.

This post was last modified on December 6, 2022 2:33 pm

Share
Show comments

Recent Posts

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

2 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

2 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

2 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

3 hours ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

4 hours ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

5 hours ago