పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ఏదో రకంగా ఇన్‌స్పైర్ అవుతుంటాడు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్. అతను నటించిన చాలా సినిమాల్లో పవన్ సినిమాల రెఫరెన్సులు కనిపిస్తుంటాయి. ఐతే ఇప్పుడు పవన్ కోసం అనుకున్న టైటిల్‌ను తేజు వాడుకుంటున్నట్లు సమాచారం. ఆ టైటిలే.. విరూపాక్ష. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ముందు ప్రచారంలోకి వచ్చిన టైటిల్ ‘విరూపాక్ష’నే. కానీ ఎందుకో ఆ టైటిల్‌ను పక్కన పెట్టి ‘హరిహర వీరమల్లు’కు ఓటు వేసింది చిత్ర బృందం. కాగా ఇప్పుడీ టైటిల్‌ను తేజు వాడుకుంటున్నట్లు సమాచారం.
సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్లో తేజు నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించి ఇటీవల ఇంట్రెస్టింగ్ పోస్టర్లు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో రానున్న ఈ చిత్రంతో ఆయన శిష్యుడైన కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ నెల 7న ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ కాబోతోంది. కాగా ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘విరూపాక్ష’ అనేది చాలా పవర్‌ఫుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించే టైటిల్. పోస్టర్లు చూస్తే ఈ టైటిల్ సినిమాకు బాగానే సూటయ్యేలా కనిపిస్తోంది. సుకుమార్ శిష్యుడి సినిమా, పైగా ఆయనే ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడంటే ఏదో ప్రత్యేకంగా ఉంటుందనే భావిస్తున్నారు. తేజుకు సరైన కమ్ బ్యాక్ అవుతుందని భావిస్తున్నారు.
వచ్చే ఏడాది వేసవి, లేదా అంతకంటే కాస్త ముందుగానే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఇంతకుముందు ఎస్వీసీసీ బేనర్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేసిన తేజు.. ఇదే బేనర్లో ఇప్పుడు వరుసగా రెండు సినిమాలు చేస్తుండడం విశేషం. జయంత్ పానుగంటి అనే కొత్త దర్శకుడితో ఈ బేనర్లో ఇటీవలే మరో కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే.
This post was last modified on December 5, 2022 5:32 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…