సీనియర్ హీరోలకు ఈ మధ్య హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతోంది. ఇంతకుముందులా వయసు అంతరం చూడకుండా ఎవరిని పడితే వాళ్లను కథానాయికలుగా పెట్టే పరిస్థితి లేదు. ఈ తరం స్టార్ హీరోయిన్లు మరీ వయసు ఎక్కువ ఉన్న హీరోల పక్కన చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. వాళ్ల డేట్లు కూడా ఖాళీగా ఉండట్లేదన్న సంగతీ తెలిసిందే. దీంతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ల సరసన పేరు లేని హీరోయిన్లనే తీసుకోవాల్సి వస్తోంది. అందులోనూ బాలయ్య సినిమాల్లో కథానాయికలకైతే ఒక రేంజ్ అంటూ ఉండట్లేదు.
బాలయ్య చివరి సినిమా అఖండలో కథానాయికగా నటించిన ప్రగ్యా జైశ్వాల్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరసింహారెడ్డిలో ఒక కథానాయికగా శ్రుతి హాసన్ ఓకే కానీ.. మరో హీరోయిన్ హనీ రాజ్ అయితే బాలయ్య స్థాయికి తక్కువే.
ఇక బాలయ్య నటించబోయే కొత్త చిత్రంలో కూడా ఒక అన్‌పాపులర్ హీరోయినే నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రియాంక జవాల్కర్ అని లేటెస్ట్ న్యూస్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే సెట్స్ మీదికి తీసుకెళ్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల బాలయ్య కూతురిగా కీలక పాత్ర పోషించనుంది. ఇక బాలయ్యకు జోడీగా ప్రియాంక జవాల్కర్ నటించబోతున్నట్లు సమాచారం.
ఐతే శ్రీలీలను కూతురిగా పెట్టి ప్రియాంకను తల్లిగా చూపించడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆమె పాత్ర యంగ్ బాలయ్యకు జోడీగా ఉండొచ్చని భావిస్తున్నారు. బహుశా ఈ చిత్రంలో ఇద్దరు బాలయ్యలు కనిపించొచ్చు. లేదా ప్రియాంక పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో ఉండొచ్చు. తాజాగా ప్రియాంకకు లుక్ టెస్ట్ జరిగిందని, ఆమెనే కథానాయికగా ఖరారు చేశారని సమాచారం.
This post was last modified on December 5, 2022 6:40 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…