ప్రభాస్ తదుపరి చిత్రం రాధేశ్యామ్ కంటే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీయబోతున్న సినిమా పట్ల ఎక్కువ ఆసక్తి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం పట్ల ప్రభాస్ కూడా చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాడు. నాగ్ అశ్విన్ కి, నిర్మాత అశ్విని దత్ కీ ఈ సినిమా పొటెన్షియల్ ఏమిటనేది బాగా తెలుసు.
అందుకే ఈ చిత్రం బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా ఎలాంటి రాజీ వద్దని డిసైడ్ అయిపోయారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ ఎలాగో ఉంటుంది కానీ, అక్కడి వాళ్లంతా సీరియస్ గా తీసుకోవాలంటే ఏమి ఉండాలనేది నాగ్ అశ్విన్ ఆలోచిస్తున్నాడు. అందుకే హీరోయిన్ గా దీపిక పదుకోన్ అయితే బెస్ట్ అని ఆమెను అప్రోచ్ అయ్యాడు.
దీపిక మహానటి చూసి, ఆ సినిమా చూడమంటూ రికమండ్ చేయడంతోనే ఆమెను సంప్రదించారని తెలిసిపోయింది. అయితే పారితోషికం పరంగా దీపికా ఎలాంటి తగ్గింపు ఇవ్వడం లేదట. ఇది హిందీతో పాటు అన్ని ప్రముఖ భాషలలో విడుదల అయ్యే సినిమా కనుక దీపికా పెద్ద అమౌంటే కోట్ చేసిందట. హీరోయిన్ కి అంత ఇస్తే బిజినెస్ పరంగా ఫీజిబుల్ ఉంటుందా లేదా అనేది అశ్విన్ తర్కించుకోవాలట.
This post was last modified on July 15, 2020 11:26 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…