టాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా నడుస్తోంది ఈ యవ్వారం. 100 డేస్ సెంటర్స్, కలెక్షన్ల గురించి కొట్టుకునే రోజులు పోయి ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ట్వీట్స్ లెక్కలతో కొట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ రికార్డుల్లో హీరోల ప్రమేయం ఏమీ ఉండదు. డైరెక్ట్ వార్ అభిమానుల మధ్యే నడుస్తుంది. దీంతో అభిమానుల ఎమోషన్ కూడా మామూలుగా ఉండదు. ఫలానా హీరో సినిమా వార్షికోత్సవానికో.. లేదా పుట్టిన రోజుకో ట్రెండ్ రికార్డును అభిమానులు నెలకొల్పితే.. మరో హీరో ఫ్యాన్స్ ఏదో ఒక సందర్భం కల్పించుకుని మరీ చెలరేగిపోతుంటారు. ఇప్పుడు పవన్ అభిమానులు అదే పని చేశారు.
ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. అతడి పుట్టిన రోజు నాడు ఒక్క రోజు వ్యవధిలో 21.5 మిలియన్ ట్వీట్లతో కొత్త రికార్డు నెలకొల్పారు. సౌత్ ఇండియాలో.. బహుశా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ మీద పడ్డ అత్యధిక ట్వీట్లు ఇవే అంటున్నారు. ఐతే రెండు నెలల కిందట ‘గబ్బర్ సింగ్’ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అలవోకగా ఒక్క రోజులో 13.8 మిలియన్ ట్వీట్లు వేసిన పవన్ ఫ్యాన్స్.. ఇప్పుడు పవన్ పుట్టిన రోజుకు 50 రోజులున్న నేపథ్యంలో ‘అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే’ హ్యాష్ ట్యాగ్‌తో మొన్న సాయంత్రం 6 గంటలకు ట్రెండ్ మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి మొదలైంది మోత. ఒక్కో అభిమాని వేలల్లో ట్వీట్లు వేయడంతో అలవోకగా పాత రికార్డును బద్దలు కొట్టేశారు. 24 గంటలు తిరిగేసరికి దాదాపు 28 మిలియన్ ట్వీట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐతే వచ్చే నెలలో మహేష్ బాబు పుట్టిన రోజు రానున్న నేపథ్యంలో వాళ్లకు కొత్త టార్గెట్ ఇచ్చినట్లయింది.
This post was last modified on July 15, 2020 8:42 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…