ఆలస్యంగా బోధపడిన రీమేక్ తత్వం

Salman Khan
Salman Khan

పక్క భాషలో ఏదైనా సినిమా హిట్టని తెలిస్తే చాలు ఆలస్యం చేయకుండా హక్కులు కొనేసుకోవడం ఆపై తీరిగ్గా రీమేక్ చేసి ప్రేక్షకుల మీదకు వదలడం మామూలైపోయింది. అయితే జనం మునుపటిలా లేరు. చాలా తెలివి మీరిపోయారు. కన్నడలోనో తమిళంలోనూ ఫలానా మూవీ బాగుందని తెలిస్తే చాలు గూగుల్ చేసి ఏ ఓటిటిలో ఉందో వెతికి సబ్ టైటిల్స్ వేసుకుని మరీ చూస్తున్నారు. హైదరాబాద్ వాసులైతే ఏకంగా వాటిని థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. దీనివల్ల మన వెర్షన్ వచ్చే లోపు దాని మీద ఇంటరెస్ట్ తగ్గిపోయి ఆ ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీదనో రన్ మీదనో పడుతోంది. ఈ సత్యం చరణ్ కు లేట్ గా బోధపడింది.

ఇటీవలే ఒక ముంబై జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడాడు. ఇకపై రీమేక్ చేయాలంటే దాని అసలు రూపం ఏ ఓటిటికి ఇవ్వనంటేనే ఒప్పుకుంటానని లేదంటే నో చెప్పేస్తానని అన్నాడు. ఇంత క్లియర్ గా ఎందుకు అన్నారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గాడ్ ఫాదర్ మొదటి నాలుగు రోజులు ఎంత హడావిడి చేసినా ఆ తర్వాత చప్పున చల్లారిపోయి బ్లాక్ బస్టర్ నుంచి యావరేజ్ కి పడిపోయింది. లూసిఫర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నా దాన్ని తీయించే పని చేయకుండా అలాగే వదిలేయడం మూల్యాన్ని చెల్లించేలా చేసింది.

దీనికి తోడు దర్శకుడు మోహన్ రాజా పదే పదే కావాలంటే మీరు మోహన్ లాల్ వెర్షన్ చూసి రండని చెప్పడం బెడిసి కొట్టింది. చరణ్ ధృవ చేసే టైంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే తని ఒరువన్ మాతృక అని తెలిసి కూడా దాన్ని ఎక్కడ చూడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయిన ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. ఆ టైంలో ఓటిటిల తాకిడి లేదు. ఆన్ లైన్ లో దొరికినా ఇప్పుడులా ఫ్రీ 4జిలు గట్రా లేవు. అందుకే సూపర్ హిట్ కొట్టింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు ఈ కారణంగానే మేజిక్ చేయలేకపోయాయి. అసలు ప్రొడ్యూసర్లని నియంత్రించడం కష్టం కాబట్టి ఈ లెక్కన చరణ్ ఇకపై రీమేకులు చేసే అవకాశం లేనట్టే