Movie News

పబ్లిసిటీ లేకుండా పది కోట్లు

ఈ మధ్యే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. అందులో రకరకాల విషయాలపై మాట్లాడిన ఆయన.. సినిమా పబ్లిసిటీ కోసం విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించాడు.

పబ్లిసిటీ ఖర్చును తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్రణాళికల గురించి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ రోజుల్లో మొత్తం సోషల్ మీడియా మీదే నడుస్తోందని.. కంటెంట్ బాగుంటే సోషల్ మీడియానే సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుందని, మౌత్ పబ్లిసిటీనే ముఖ్యం అని ఆయన అన్నారు. ‘కాంతార’ అనే సినిమాకు ఏమైనా పబ్లిసిటీ చేశారా అంటూ ఉదాహరణ కూడా చూపించారు. తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తున్న తమిళ అనువాద చిత్రం ‘లవ్ టుడే’ కూడా థియేటర్లలో మ్యాజిక్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజు చెప్పిన స్థాయిలో ‘లవ్ టుడే’ మరీ వసూళ్ల మోత మోగించేయలేదు కానీ.. దాని స్థాయిలో అది బాగానే ఆడుతోంది. ఈ సినిమాకు ఒక చిన్న ప్రమోషనల్ ఈవెంట్ చేయడం తప్పితే పబ్లిసిటీ పరంగా దిల్ రాజు ఏమంత హడావుడి చేయలేదు. మీడియాలో ప్రకటనలతో ఏమీ హోరెత్తించలేదు. సినిమాలో విషయం ఉందని, అది యూత్‌ను ఆకర్షిస్తుందని నమ్మారు. ఆయన నమ్మకమే నిజమైంది.

‘లవ్ టుడే’ తొలి వీకెండ్లో, ఆ తర్వాత మంచి వసూళ్లతో సాగుతోంది. ఇప్పటిదాకా ‘లవ్ టుడే’ తెలుగులో రూ.7-8 కోట్ల మధ్య నెట్ వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్లో ‘హిట్-2’ లాంటి క్రేజీ మూవీ వస్తున్నప్పటికీ.. ‘లవ్ టుడే’ స్ట్రాంగ్‌గానే నిలబడుతుందని ఆశిస్తున్నారు. ఫుల్ రన్లో రూ.10 కోట్ల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇలాంటి ఓ చిన్న అనువాద చిత్రానికి ఆ ఫిగర్ చాలా పెద్దదే. అది కూడా పబ్లిసిటీ ఏమీ లేకుండా పది కోట్లు రాబట్టడం అంటే మాటలా?

This post was last modified on November 30, 2022 7:07 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

4 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

6 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago