టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌తో కొంచెం సాన్నిహిత్యం ఉన్న ఎవ్వరు మాట్లాడినా.. అతడి అతిథి సత్కారాల గురించిన ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. తనతో ఎవరు కలిసి పని చేసినా.. తనను కలవడానికి ఎవరు వచ్చినా వారి కడుపు పగిలిలా అద్భుతమైన వంటకాలు తినిపించడం ప్రభాస్‌కు అలవాటు. తన పెదనాన్న కృష్ణం రాజు నుంచి వారసత్వంగా అందుకున్న ఈ సంప్రదాయం ద్వారా ప్రభాస్ ఎన్నో సందర్భాల్లో వార్తల్లో నిలిచాడు. ఎవరైనా అతిథి వస్తే ఐదో పదో వంటకాలు వడ్డిస్తారు కానీ.. ప్రభాస్ 30-40 రకాల వంటకాలతో వారిని ముంచెత్తుతాడు.
‘రాధేశ్యామ్’లో ప్రభాస్ అమ్మ క్యారెక్టర్ చేసిన భాగ్యశ్రీ సహా ఎంతోమంది.. ప్రభాస్ ఫుడ్డుతో, ప్రేమతో ఎలా ఇబ్బంది పెడతాడో చెప్పుకొచ్చారు. ఇప్పుడీ జాబితాలోకి తమిళ స్టార్ హీరో సూర్య కూడా వచ్చాడు. ప్రభాస్ రాజు గారి భోజనం గురించి సూర్య సైతం ఒక ఇంగ్లిష్ డైలీ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడాడు.
‘‘నేను ఒక సినిమా షూటింగ్ కోసం ఒకసారి హైదరాబాద్ వెళ్లాను. అప్పుడు ప్రభాస్ నన్ను డిన్నర్‌కు పిలిచాడు. సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్పా. కానీ షూటింగ్‌లోనే రాత్రి 11 గంటలు దాటిపోయింది. ప్రభాస్‌కు సారీ చెప్పి ఇంకోసారి కలుద్దామని చెప్పాలని అనుకున్నా. కానీ రాత్రి 11.30కి ప్రభాస్‌ను హోటల్లో కలిస్తే.. నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. డిన్నర్ అంటే హోటల్ లేదా ప్రొడక్షన్ హౌస్ నుంచి భోజనం తెప్పిస్తాడని అనుకున్నా. కానీ ఇంటి నుంచి వాళ్ల అమ్మగారు పంపిన రకరకాల వంటలతో డిన్నర్ సిద్ధం చేశాడు. నాకు ఇంకా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే.. నా కోసం అప్పటి వరకు ప్రభాస్ భోజనం చేయకుండా ఎదురు చూశాడు. నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీ ఎప్పుడూ తినలేదు’’ అంటూ ప్రభాస్ ఆతిథ్యాన్ని కొనియాడాడు సూర్య.
గతంలో సూర్య నటించిన ‘రాక్షసుడు’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన ప్రభాస్.. సూర్య మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
This post was last modified on November 30, 2022 6:07 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…