హిట్-2.. ఇంకో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న థ్రిల్లర్ మూవీ. ఇంతకుముందు విశ్వక్సేన్ హీరోగా ‘హిట్’ సినిమాను తీసిన కొత్త దర్శకుడు శైలేష్ కొలను.. ‘హిట్’ను ఒక ఫ్రాంఛైజీగా మార్చి ‘సెకండ్ కేస్’ పేరుతో ఒక కొత్త కథను ఎంచుకుని ఈ సినిమా తీశాడు. డీసెంట్ హిట్ అయిన ‘హిట్’ను మించి ఇంకో లెవెల్ అనేలా ఈ సినిమా ప్రోమోలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. చివరగా వచ్చిన ట్రైలర్లోని కొన్ని షాట్లు అయితే ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించాయి.
ఈ శుక్రవారం ఒక స్పైన్ చిల్లింగ్-థ్రిల్లింగ్ రైడ్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించాయి. ట్రైలర్లో హీరోను మించి అందరి దృష్టినీ ఆకర్షించిన క్యారెక్టర్ విలన్‌దే. అత్యంత కిరాతకమైన రీతిలో అమ్మాయిలను చంపే సైకో కిల్లర్ క్యారెక్టర్ ట్రైలర్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.
వేర్వేరు అమ్మాయిలను చంపి.. ఒక్కొక్కరి బాడీ పార్ట్స్ తీసి ఒక అమ్మాయిది ప్లేస్ చేయడం.. అమ్మాయి మెడపై కొరికితే పళ్ల గాటు పడడం.. లాంటి సన్నివేశాలు చాలా క్యూరియస్‌గా అనిపించాయి. ఇక కోడి బుర్ర డైలాగ్‌తో ముడిపడ్డ షాట్ అయితే వేరే లెవెల్. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ ఎవరా విలన్ అనే ఉత్కంఠ కలిగింది. ఐతే ఆ విలన్ ఎవరనే విషయంలో నెటిజన్లు రకరకాల ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు.
ఒక నెటిజన్ ఏమో నానీనే విలన్ అంటే.. ఇంకొకరేమో విలన్ అమ్మాయి, అది మీనాక్షి చౌదరినే అంటూ గెస్ చేస్తున్నారు. ఈ ట్వీట్లను అడివి శేష్ చదివి ఆసక్తికర రీతిలో స్పందిస్తున్నాడు. ప్రేక్షకులను అంచనాలపై కొంచెం సరదాగా, వెటకారంగానే స్పందించాడు శేష్. అతడి ట్వీట్లు సినిమాలో విలన్ ఎవరనే విషయంలో మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. సినిమాలో ఆ సస్పెన్స్ ఎలిమెంటే కీలకంగా ఉండేలా ఉంది. అందుకేనేమో సినిమా చూసిన వాళ్లు స్పాయిలర్స్ లేకుండా చూడాలని శేష్ ప్రి రిలీజ్ ఈవెంట్లో విజ్ఞప్తి చేశాడు..
This post was last modified on November 30, 2022 5:54 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…