నవంబర్ అయిపోయింది. డిసెంబర్ నుంచి మొదలుపెడితే సంక్రాంతి సీజన్ కు కేవలం నలభై రోజులు మాత్రమే ఉంటుంది. ఏడాది మొత్తంలో చాలా కీలకంగా భావించే జనవరిలో థియేటర్ల కోసం ఒక డబ్బింగ్ సినిమాతో చిరంజీవి బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు పోటీ పడాల్సి రావడం ఈసారి పరిస్థితి ఎంత అనూహ్యంగా ఉందో సూచిస్తోంది. ఒకవేళ వారసుడు నిర్మాత దిల్ రాజు కాకపోయి ఉంటే ఏం జరిగేదో కానీ మొత్తానికి పోటీ మాత్రం చాలా టఫ్ గా ఉండటం ఖాయం. ముఖ్యంగా కొణిదెల నందమూరి అభిమానులు ట్విట్టర్ ఇన్స్ టా వేదికగా పూర్తిగా తమ హీరోల ప్రమోషన్ల మీద దృష్టి పెట్టబోతున్నారు.
వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి రెండు సినిమాలకు మైత్రినే నిర్మాతలు కావడం ప్రయోజనాల కన్నా ఎక్కువగా ఇబ్బందులనే సృష్టిస్తోంది. ఎందుకంటే అంటే సుందరానికి, సర్కారు వారి పాట, పుష్ప 1కు సంబంధించిన కొన్ని అడ్జస్ట్ మెంట్లు కొందరు డిస్ట్రిబ్యూటర్లకు చేయాల్సి ఉంది. ఇప్పుడవే తెరమీదకొస్తున్నాయి. చిరు బాలయ్యలు ఈసారి క్రేజ్ విషయంలో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. చాలా ఏరియాలకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని క్లోజ్ చేశారనే టాక్ కూడా ఉంది. ఫైనల్ ఫిగర్స్ కోణంలో వీరయ్యదే పైచేయిగా కనిపిస్తోంది కానీ వీరసింహాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు.
ఇప్పటిదాకా కేవలం ఒక్క ఆడియో సింగల్, టీజర్ మాత్రం బయటికి వచ్చాయి. ఇంకా పబ్లిసిటీ వేగం పెంచాలి. చూడ్డానికి నెలన్నర అనిపిస్తోంది కానీ ఇది చాలా తక్కువ. ఇద్దరు ఫ్యాన్స్ ని సంతృప్తి పరుస్తూ ఎక్కడా నెగటివ్ అనిపించుకోకుండా చూసుకోవాలి. బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్దుతూనే ప్రీ రిలీజ్ ఈవెంట్లు వేర్వేరు చోట్ల ప్లానింగ్ చేసుకోవాలి. షూటింగులకు ఇంకా గుమ్మడికాయలు కొట్టలేదు. చెరో పాట చిత్రీకరణ బ్యాలన్స్ ఉందట. వారసుడుని పరిగణనలోకి తీసుకున్నా తీసుకోకపోయినా ఇకపై మైత్రికు ఎన్నో సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ఉరుకులు పరుగులు తప్పవు.
This post was last modified on November 30, 2022 11:30 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…