ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా వీక్షించేలా చర్యలు తీసుకున్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో రాజకీయ అంశాలపై అవగాహన కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఇక, ఎమ్మెల్యేలు, మంత్రులలో ఒత్తిడి తగ్గించేందుకు ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు క్రీడల పోటీలు కూడా నిర్వహించనున్నారు.
తాజాగా.. చేనేతలకు అండగా ఉండేలా.. అసెంబ్లీలో చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆప్కో ఆధ్వర్యంలో పలువురు నేత కార్మికులు అసెంబ్లీ ఆవరణలో చేనేత వస్త్రాలతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. సభ జరిగినన్ని రోజులూ.. ఈ స్టాళ్లు తెరిచి ఉంటాయని.. అసెంబ్లీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సిబ్బంది సహా మీడియా.. వరకు అందరూ ఇక్కడ వస్త్రాలను కొనుగోలు చేయొచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా ఈ స్టాళ్లను స్పీకర్ క్షుణ్ణంగా పరిశీలించారు. చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందించారు. స్వయంగా పట్టుచీరలు, పట్టు పంచె సహా పలు చొక్కాలను స్పీకర్ కొనుగోలు చేశారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ చేనేత వైభవం తెలియజేసేందుకే ఈ ఎగ్జిబిషన్ ను అసెంబ్లీలో ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు.
అసెంబ్లీలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో నాణ్యమైన వస్త్రాలపై 40 శాతం వరకు రాయితీ ఇస్తారని స్పీకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని.. తద్వారా నేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. పలువురు మంత్రులు సైతం వస్త్రాలుకొనుగోలు చేశారు. కాగా.. అసెంబ్లీ వంటి రాజ్యాంగ బద్ధమైన వేదికల వద్ద.. చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
This post was last modified on February 19, 2026 4:52 pm
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…