ఆల్రెడీ రాజమౌళి డైరక్షన్లో RRR వంటి వరల్డ్-క్లాస్ బ్లాక్‌బస్టర్ చేసి, ఆ తరువాత శంకర్ డైరక్షన్‌లో #RC15 చేస్తున్న చరణ్.. సడన్ గా అసలు ‘ఉప్పెన’ డైరక్టర్ బుచ్చిబాబు సినిమా ఓకే చేశాడేంటి అని ఇప్పుడు ట్రోలింగ్‌కు కూడా గురవుతున్నాడు. అయితే ఈ దర్శకుడితో సినిమా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ చెప్పడం తప్పే కాని, సినిమా రేంజ్ ఎలా ఉండాలో మాత్రం మనం చెప్పుకోవచ్చు. అక్కడ తేడా కొడితే మాత్రం చరణ్ పెద్ద రాంగ్ స్టెప్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు.
బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనలో ఒక సింపుల్ పాయింట్ పట్టుకుని, దానిని భారీ బడ్జెట్‌తో తీశాడు. ప్రొడక్షన్ కూడా బాగా లేటవ్వడంతో 6-7 కోట్లతో చేయాల్సిన సినిమాకు 21 కోట్లు ఖర్చయ్యిందని అప్పట్లో రూమర్లు కూడా వినిపించాయి. కాని రామ్ చరణ్ వంటి హీరో చేతిలో ఉన్నప్పుడు అలాంటి సింపుల్ పాయింట్‌తో ప్యాన్ ఇండియా సినిమా చేయడం కుదరదు. ఏదైనా సరైన పాయింటే ఉండాలి. భారీగా అంటే భారీగానే చూపించాలి. కాబట్టి నెరేషన్ విషయంలో బుచ్చిబాబు చాలా జాగ్రత్తపడాల్సిందే. ఒక్క సినిమా తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో సినిమానే కెజిఎఫ్ చేశాడు కాబట్టి, బుచ్చిబాబు కూడా అదే తరహాలో భారీ హిట్టే కొట్టే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుంది. కాకపోతే హీరో మార్కెట్‌ని అర్ధం చేసుకుని సినిమా డిజైన్ చెయ్యాలి.
ఆల్రెడీ RRR, ఆ తరువాత #RC15 లైన్‌లో ఉంది. కాబట్టి తదుపరి వచ్చే బుచ్చిబాబు సినిమా ఖచ్చితంగా చరణ్ రేంజ్‌ను ఇంకా పెంచేదే అయ్యుండాలి. ఒకవేళ బుచ్చిబాబు ఈ విషయంలో జాగ్రత్తపడకపోతే మాత్రం.. ఆ తరువాత చాలామంది దర్శకుల తరహాలో ఫేం అండ్ నేం పోగొట్టుకునే ఛాన్సుంటుంది. చూద్దాం మరి ఎటువంటి సినిమాతో చరణ్ అండ్ బుచ్చిబాబు మనముందుకు వస్తారో!
This post was last modified on November 30, 2022 8:42 am
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…