‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సైతం భారీ విజయాన్నే అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ‘బాహుబలి’ని మించి ‘ఆర్ఆర్ఆర్’కు అప్రిసియేషన్ వచ్చింది. దీంతో జక్కన్న తర్వాతి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తర్వాతి సినిమా మహేష్ బాబుతో అనే విషయం ఎప్పుడో ఫిక్సయింది. కాకపోతే ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉంది.
మహేష్‌తో ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ చేయబోతున్నట్లుగా జక్కన్న ఆల్రెడీ తనే స్వయంగా సంకేతాలు ఇచ్చాడు. ఆ సినిమా కోసం స్క్రిప్టు పని నడుస్తుండగా.. ‘హిట్-2’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు రాజమౌళి. ఈ సందర్భంగా యాంకర్ సుమ.. వేదిక ఎక్కి రాజమౌళిని తర్వాతి సినిమా గురించి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ సినిమా అప్‌డేట్స్ ఇవ్వమని అడిగింది.
ఐతే సుమ ప్రశ్నల్లో వేటికీ ఇప్పుడే సమాధానం చెప్పలేనంటూ.. మహేష్‌తో తాను చేయబోయే తర్వాతి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు యాంకర్ మాత్రం సుమనే అని తేల్చేశాడు రాజమౌళి. దీంతో స్టేడియం ఒక్కసారిగా నవ్వులు పూశాయి. రాజమౌళికి సుమ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళే కాక ఆయన కుటుంబ సభ్యుల సినిమాలన్నింటికీ ఆమెనే యాంకరింగ్ చేస్తుంటుంది. కాబట్టి మహేష్‌తో రాజమౌళి సినిమాకు కూడా ఆటోమేటిగ్గా ఆమె యాంకరింగ్ చేస్తుందనడంలో ఎవరికీ సందేహాల్లేవు.
ఇక ‘హిట్-2’ గురించి జక్కన్న మాట్లాడుతూ.. ‘హిట్’ను ఒక ఫ్రాంఛైజీగా మార్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు. ‘హిట్’ లాగే ‘హిట్-2’ కూడా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని.. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ తీసుకురావడంలో దర్శకుడు శైలేష్ కొలను విజయవంతం అయ్యాడని.. ‘హిట్’ సిరీస్‌లో ఇంకా మరిన్ని సినిమాలు వస్తాయని.. అన్నీ విజయవంతం అవుతాయని రాజమౌళి అన్నాడు.
This post was last modified on November 29, 2022 2:22 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…