పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాక ప్రకటించిన ప్రాజెక్టుల్లో అభిమానులను అత్యంత ఎగ్జైట్ చేసింది హరీష్ శంకర్ చిత్రమే అనడంలో మరో మాట లేదు. అందుక్కారణం వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ కావడమే. పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి వారిని ఉర్రూతలూగించాడు హరీష్. తీసింది రీమేకే అయినా.. మార్పులు చేర్పులతో, అనేక కొత్త మెరుపులతో ఆ సినిమాను వేరే లెవెల్లో నిలబెట్టాడు హరీష్.
ఈసారి రీమేక్ కాకుండా ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో పవన్‌తో స్ట్రెయిట్ మూవీ తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు హరీష్. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. కానీ ఎంతకీ ఆ సినిమా పట్టాలెక్కకపోవడం మాత్రం నిరాశ కలిగించే విషయమే.
ఇప్పట్లో సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు లేకపోయినా హరీష్ నీరుగారి పోవట్లేదు. ఛాన్స్ వచ్చినపుడు సత్తా చాటాలని ఎదురు చూస్తున్నాడు. కాగా పవన్‌తో చేయబోయే సినిమా గురించి ట్విట్టర్లో ఒక అభిమానితో హరీష్ జరిపిన సంభాషణ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
రాజమౌళి గురించి అమెరికన్ మీడియాలో వచ్చిన కథనంపై స్పందించిన హరీష్‌ను ఉద్దేశించి ఒక నెటిజన్ మాట్లాడుతూ.. పీకేతో ఈసారి ‘గబ్బర్ సింగ్’ లాంటి రొటీన్ మసాలా సినిమా చేయొద్దని.. అందులో బౌన్సింగ్ పైట్లు కాకుండా రియలిస్టిక్ స్టంట్స్ ఉండేలా చూడాలని.. సినిమా ఇంటర్నేషనల్ రేంజిలో ఉండాలని సూచించాడు.
దీనికి హరీష్ స్పందిస్తూ.. “మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందుకు సారీ. మీతో నేను ఏకీభవించను” అని పేర్కొన్నాడు. అంతే కాక ‘విజ్ఞాన ప్రదర్శనలు వద్దు’ అనే ‘వెంకీ’ సినిమా మీమ్‌ను కూడా పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి తన నుంచి కల్ట్‌లు క్లాసిక్‌లు ఆశించొద్దని.. మెజారిటీ పవన్ అభిమానులు కోరుకునేలా తాను పవర్ స్టార్‌తో మాస్ మసాలా సినిమానే తీయబోతున్నానని హరీష్ చెప్పకనే చెప్పినట్లుంది.
This post was last modified on November 27, 2022 11:05 am
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్‌ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…