ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. దానికి ఎంతో కొంత లక్కు కూడా తోడవ్వాలి. రవితేజ కెరీర్ మొదలుపెట్టగానే స్టార్ హీరో అవ్వలేదు. చిన్నా చితకా లాంటి వేషాలు ఎన్నో వేశాడు. కర్తవ్యం, అల్లరి ప్రియుడు లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించినా కనీసం తన ఫ్యాన్స్ కూడా అంత సులభంగా గుర్తుపట్టలేని చాలా తక్కువ క్యారెక్టర్లవి. అలా ఏళ్ళ తరబడి వేచి చూసి చూసి చివరికి నీకోసం రూపంలో అదృష్టం తలుపు తట్టడం, ఆ తర్వాత పూరితో పరిచయం, ఇడియట్ లాంటి బంపర్ హిట్లు పడటం ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు
ఈ ప్రయాణంలో ఎక్కడ విసుగొచ్చి మధ్యలో వెనక్కు వెళ్ళిపోయినా ఇవాళ మాస్ మహారాజా అనే స్టార్ బదులు ఒక మాములు వ్యక్తి ఎక్కడో ఉండేవాడు. ఇప్పుడు సత్యదేవ్ కూడా ఇలాంటి బ్రేక్ కోసమే ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఫాదర్ అవకాశం వచ్చినప్పుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టానికి ఉబ్బితబ్బిబయ్యాడు. రిలీజయ్యాక మొదటి రెండు మూడు రోజుల తన పెర్ఫార్మెన్స్ గురించి విపరీతమైన పొగడ్తలు. ఇంకేముంది దశ తిరిగిందనుకున్నారు. కట్ చేస్తే రెండో వారానికే దాని సౌండ్ తగ్గిపోయింది. అసలు మెగాస్టార్ గురించే ఎక్కువ మాట్లాడనప్పుడు ఇక కుర్ర హీరో సంగతి చెప్పాలా.
ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన గుర్తుందా శీతాకాలం ఎట్టకేలకు డిసెంబర్ 9 థియేటర్లలో అడుగు పెడుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ అయినప్పటికీ దీని మీద ఏ మాత్రం బజ్ లేదు. కన్నడ హిట్ మూవీ రీమేక్ అయినా హైప్ తెచ్చుకోవడంలో తడబడుతోంది. కృష్ణమ్మకు ఇదే ఇబ్బంది తలెత్తుతోంది. ఈ రెండింట్లో కనీసం ఒక్కటి హిట్ అయినా సత్యదేవ్ కెరీర్ ఊపందుకుంటుంది. గాడ్ ఫాదర్ వల్ల నెగటివ్ వేషాలకు ఆఫర్లు వచ్చాయి కానీ సోలో హీరోగా తక్కువే. అందుకే శీతాకాలం కృష్ణమ్మలో ఏదో ఒకటి బ్రేక్ ఇవ్వడం కుర్రహీరోకి అత్యవసరం
This post was last modified on November 27, 2022 10:41 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…