కొన్నేళ్ల ముందు ‘ప్యార్ ప్రేమ కాదల్’ అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో హరీష్ కళ్యాణ్ అనే చిన్న హీరో నటించాడు. హీరోయిన్‌గా రైజా విల్సన్ అనే చిన్న స్థాయి కథానాయిక నటించింది. అందులో ఆమెది బోల్డ్ రోల్. ఆ సినిమా ట్రైలర్లో ఒక సీన్ చూసి అందరూ షాకైపోయారు. హీరో హీరోయిన్ ఒక మెడికల్ షాప్ ముందు ఆగితే.. హీరోను ముందు ఏదో తీసుకురమ్మని చెప్పి.. ఆ తర్వాత ఇంట్లో నాన్న లేడు అని హింట్ ఇచ్చి నువ్వు కూడా ఏదైనా కావాలంటే తెచ్చుకో అంటుంది హీరోయిన్. పరోక్షంగా ఇక్కడ కండోమ్ తెచ్చుకోమని హీరోయిన్ చెబుతుందన్నమాట.
ఈ ట్రైలర్ చూసి ఇదొక బి గ్రేడ్ సినిమాలా ఫీలయ్యారు జనాలు. ఆ సినిమాను కూడా ఆ కోణంలోనే చూశారు. ఇప్పుడు ఆ చిత్రాన్నే తెలుగులో ‘ఊర్వశివో రాక్షసివో’ పేరుతో రీమేక్ చేశారు. ఇలాంటి సినిమాలో అల్లు శిరీష్ లాంటి పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో… పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోల సరసన నటించిన అను ఇమ్మాన్యుయెల్ నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ముఖ్యంగా కాస్త ఇమేజ్ ఉన్న ఏ హీరోయిన్ అయినా ఇలాంటి పాత్ర చేయడానికి సందేహిస్తుంది. కానీ అను ధైర్యం చేసి ఈ సినిమాలో నటించింది. అందాల ప్రదర్శనలో, ఇంటిమేట్ సీన్లలో ఏమాత్రం హద్దులు పెట్టుకోలేదు. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఆమే అంటే ఆశ్చర్యం లేదు. ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయిందన్నా.. ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయన్నా ఆమే కారణం.
ఐతే అను ఇంత కష్టపడ్డా పెద్దగా ప్రయోజనం ఏమీ లేకపోయిందనే అనిపిస్తోంది. ‘ఊర్వశివో రాక్షసివో’ అవ్వాల్సినంత పెద్ద హిట్ కాలేదు. అను గురించి రిలీజ్ తర్వాత పెద్దగా డిస్కషన్ జరగలేదు. కొత్తగా తెలుగులో ఆమెకు అవకాశాలేమీ వచ్చినట్లు కనిపించడం లేదు. మామూలుగా ఏదైనా సినిమా హిట్టయినా.. హీరోయిన్ బాగా హైలైట్ అయినా చకచకా సినిమాలు వరుస కట్టేస్తుంటాయి. కానీ ప్రస్తుతానికైతే అను విషయంలో సౌండ్ లేదు. మరి రాబోయే రోజుల్లో అయినా అనుకు ఏవైనా అవకాశాలు దక్కి తన కష్టానికి ఫలితం అందుతుందేమో చూడాలి.
This post was last modified on November 27, 2022 9:06 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…