ఓ రెండు రోజుల నుండి నెట్టింట్లో మారుమోగిపోయిన మ్యాటర్ ఏంటంటే.. ఈ మధ్య కాలంలో తమన్ కొడుతున్న ట్యూన్స్ అంతగా క్యాచీగా లేవు కాబట్టి, సర్కారు వారి పాట సినిమాలో పాటలు ఓ రెండు తప్ప ఏవీ పెద్దగా క్లిక్ కాలేదు కాబట్టి, #SSMB28 కోసం ఇప్పుడు త్రివిక్రమ్ మళ్ళీ అనిరుధ్‌ను దించుతున్నాడంటూ టాక్ వచ్చేసింది. వీటిపై క్లారిటీ ఇవ్వడానికి, తమన్‌కు బర్త డే విషెస్ చెప్పిన సితార వంశీ, #SSMB28 ట్యూన్స్ కోసం వెయిటింగ్ అంటూ ఒక కామెంట్ చేశాడు. దానితో తమన్‌ను మార్చట్లేదని క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడ అనిరుధ్ మ్యాటర్ ఓసారి డిస్కస్ చేద్దాం.
అసలు ఈ మ్యూజిక్ డైరక్టర్‌ను పెట్టుకో, పలానా డైరక్టర్‌తో వద్దు, పలానా హీరోయిన్‌ను తీసుకోండి అంటే అవతల దిగ్గజాలైన మహేష్ బాబు, త్రివిక్రమ్ వంటి స్టార్స్ వింటారా? అవన్నీ పక్కన పెట్టేస్తే.. అసలు అనిరుధ్‌కు తెలుగు బాషను ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ హుక్ చేయాలి అనే విషయం తెలియదని.. అందుకే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజయ్యాక.. ముందు నువ్వు వెళ్ళి తెలుగు నేర్చుకో అని చెప్పానని త్రివిక్రమ్ స్వయంగా సెలవిచ్చాడు. అటువంటిది ఇప్పుడు తమన్‌ను తీసేసి అనిరుధ్‌ను ఎలా పెట్టుకుంటాడు? పైగా తమన్ ఎవరికి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చినా కూడా త్రివిక్రమ్ కోసం మాత్రం ఎప్పుడూ టెరిఫిక్ ట్యూన్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోరే ఇస్తాడు. కాబట్టి #SSMB28కు తమన్ రైట్ చాయిస్ అని అందరూ నమ్మాల్సిందే.
ఒక్క ప్రక్కన మహేష్ పితృవియోగం చెంది బాధలో ఉంటే, త్రివిక్రమ్ కూడా సూపర్ స్టార్ వెంటే ఉంటూ ఆయనకు ధైర్యాన్ని చెప్పే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో తమన్ వద్దు, అనిరుధ్ వద్దు, వాళ్లొద్దూ, వీళ్లొద్దూ అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేయడం ఏంటమ్మా?
This post was last modified on November 25, 2022 10:08 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…