థియేటర్ ఎక్స్ పీరియన్స్ అంటే కేవలం ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాఫిక్స్ కాదు, కాంతార లాంటి డిఫరెంట్ జానర్సూ కాదు. ఎందుకంటే ఇవి అరుదుగా జరిగే ప్రయత్నాలు. మహా అయితే రెండేళ్లకు మూడు నాలుగు వస్తాయి అంతే. మిగిలిన టైంలో జనాన్ని థియేటర్ కు రప్పించాలంటే కావాల్సింది మాస్ బొమ్మలే. గత కొన్ని నెలలుగా హీరోయిజంతో విజిళ్లు కేకలు పెట్టించే తెలుగు స్టార్ హీరో బొమ్మ సరిగా పడలేదు. ఈ మధ్యే విడుదలైన సుడిగాలి సుధీర్ గాలోడు సినిమా గురించి ఒక్కరూ పాజిటివ్ గా మాట్లాడింది లేదు. కానీ మొదటి వారం పూర్తి కాకుండానే మూడు కోట్ల షేర్ కు దగ్గరగా వెళ్లడం చూసి ఎవరికి నోటా మాట రావడం లేదు.
ఇదంతా మల్టీప్లెక్సుల నుంచి వచ్చిన కలెక్షన్ కాదు. బిసి సెంటర్ల సింగల్ స్క్రీన్ల నుంచి రాబడుతున్న లెక్క. అసలు మూడో రోజైనా ఉంటుందా లేదానే అనుమానాలకు తెరదించుతూ కొన్ని చోట్ల రెండు వారాలు గ్యారెంటీ రన్ కు స్క్రీన్లను లాక్ చేసుకుంది. దీన్ని బట్టి మాస్ ఆడియన్స్ ఎంత కరువులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గాలోడు చూశాక సుధీర్ మంచి కథలను ఎంచుకుంటే గొప్ప ఫలితాలు అందుకోవచ్చనే మాట అందరి నోటా వినిపిస్తోంది. అసలు విషయమే లేని ఇలాంటి సినిమానే ఇంతగా ఆడితే కంటెంట్ బలంగా ఉంటే గట్టిగా కొట్టొచ్చనేది అభిమానుల మాట.
మరి సుధీర్ కే ఇంత రేంజ్ రెస్పాన్స్ వస్తే ఇక జనవరిలో రాబోయే వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఏ స్థాయి ఊచకోత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ పర్లేదనే టాక్ వచ్చినా చాలు సంక్రాంతి అడ్వాంటేజ్ తో చిరు బాలయ్య రికార్డులను మడత పెట్టేస్తారు. సీతారామం, బింబిసార, కార్తికేయ 2, యశోద, గాడ్ ఫాదర్ ఫలితాలు బ్లాక్ బస్టర్స్ నుంచి యావరేజ్ దాకా బాగానే ఉన్నా మాస్ కి పూర్తి స్థాయి గూస్ బంప్స్ ఇచ్చినవి కాదు. అందుకే ఆ లోటుని తీర్చే బొమ్మలు రావాలి. ఒకవేళ రవితేజ డిసెంబర్ 23న ధమాకాతో ఏదైనా సర్ప్రైజ్ ఇస్తే సంతోషం లేదంటే సంక్రాంతి దాకా ఎదురు చూడాల్సిందే.
This post was last modified on November 23, 2022 12:32 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…