తెలుగులో చాలా తక్కువగా వచ్చే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జానర్ లో ఒక ప్రత్యేకత సంతరించుకున్న సినిమా హిట్. విశ్వక్ సేన్ నటించిన మొదటి భాగం హిట్టయ్యాక దానికి కొనసాగింపు ఉంటే బాగుండుననే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే హిట్ 2 సిద్ధమైపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మర్డర్ మిస్టరీ డిసెంబర్ 2న విడుదల కానుంది. మేజర్ తర్వాత ప్యాన్ ఇండియా గుర్తింపు వచ్చేసిన అడవి శేష్ ఈసారి పోలీస్ ఆఫీసర్ పాత్రను టేకప్ చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ లోనే అంత వయొలెన్స్ చూపిస్తే నెక్స్ట్ జరగబోయే పబ్లిసిటీ మీద హైప్ రాకుండా ఉంటుందా.
దానికి తగ్గట్టే ఇవాళ ట్రైలర్ వచ్చేసింది. కృష్ణదేవ్(అడవి శేష్)సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నేరస్తులకు కోడి బుర్ర ఉంటుందని వాళ్ళను పట్టుకోవడం చాలా తేలికనే అభిప్రాయంతో ఉంటాడు. అదే మీడియా ముందు కూడా అంటాడు. సంజన అనే అమ్మాయి దారుణంగా హత్య చేయబడిన తర్వాత ఆ కేసుని ఛేదించడం కృష్ణదేవ్ కు సవాల్ గా మారుతుంది. మర్డర్లు చేస్తున్న వాడు తాను అంచనా వేసినంత తక్కువ కాదని త్వరగా అర్థం చేసుకుంటాడు. కానీ మరోవైపు యువతుల హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఆఖరికి కృష్ణ దేవ్ ఇంట్లోకే వచ్చేంత ప్రమాదకరంగా మారిన ఆ సైకో కిల్లర్ ని ఎలా పట్టుకున్నారనేదే స్టోరీ.
లైన్ పరంగా చూసుకుంటే గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయి కానీ ఊహించని థ్రిల్స్ ట్విస్టులు లేకుండా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించరు కాబట్టి అవేంటో స్క్రీన్ మీద చూడాల్సిందే. ముందు నిర్లక్ష్యం ఆ తర్వాత భయం బాధ్యతతో కూడిన పోలీస్ గా అడవి శేష్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించాడు. విజువల్స్ లో మంచి ఇంటెన్సిటీ కనిపిస్తోంది. రావురమేష్, భరణి, పోసాని ఇలా సీనియర్ క్యాస్టింగ్ పెద్దదే ఉంది. మీనాక్షి ఫిమేల్ లీడ్. జాన్ స్టీవర్ట్ ఎడూరి నేపధ్య సంగీతం అరెస్టింగ్ గా ఉంది. మొత్తానికి హిట్ 2 నుంచి ఆశిస్తున్నది ట్రైలర్ ద్వారా అయితే ఇచ్చారు. ఇక సినిమా ఎలా ఉంటుందో పది రోజులు ఆగితే రిజల్ట్ వచ్చేస్తుంది.
This post was last modified on November 23, 2022 12:26 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…