Movie News

కౌంట్ ఉంది కానీ సౌండ్ లేదు

ఎల్లుండి కంటెంట్ పరంగా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలవుతున్నాయి కానీ వేటికీ అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో లేకపోవడం ట్రేడ్ ని ఆందోళనకు గురి చేస్తోంది. మూడు వారాల క్రితం తమిళంలో రిలీజై ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న లవ్ టుడేకి సైతం రెస్పాన్స్ సోసోగా ఉంది. నిర్మాత దిల్ రాజు మాత్రం దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొదటి రోజు ఎలా ఉన్నా వీకెండ్ కంతా హౌస్ ఫుల్స్ పడటం గ్యారెంటీ అనే స్థాయిలో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తమిళ వెర్షన్ ని ఆన్ లైన్లో చాలా మంది ఆల్రెడీ చూసేయడం ప్రభావం చూపించడాన్ని కొట్టిపారేయలేం.

అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సైతం బజ్ విషయంలో పోరాడుతోంది. ప్రమోషన్లు గట్రా బాగానే చేస్తున్నా కాన్సెప్ట్ పరంగా సీరియస్ మూవీ కావడంతో మాస్ జనాలు ఫస్ట్ డే టాక్ కోసం ఎదురు చూస్తున్నారు. నలభై శాతం కామెడీ కూడా ఉంటుందని అల్లరోడు హామీ ఇస్తున్నా ఇది ఎంటర్ టైన్మెంట్ జానర్ కిందకు రాదనే క్లారిటీ ప్రేక్షకులకుంది. అందుకే వేచి చూసే ధోరణిలో మొదటి రోజే టికెట్లు కొనేసే ఆత్రం చూపించడం లేదు. ఇక వరుణ్ ధావన్ బాలీవుడ్ మూవీని తోడేలుగా అందిస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉన్నా మన జనానికి వెంటనే కనెక్ట్ అయ్యే మ్యాటర్ అనిపించలేదు.

సో శుక్రవారం వీటికి పెద్ద సవాలే ఉండనుంది. గత వారం వచ్చిన మసూద సెకండ్ వీక్ లోనూ కొనసాగనుంది. పికప్ స్లోగా ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఏ సెంటర్లలో తీసేసేంత వీక్ గా కలెక్షన్లు లేవు. యశోద కూడా నెట్టుకొస్తోంది. గాలోడు మీద ఎంత నెగటివిటీ వచ్చినా బిసి కేంద్రాల్లో తీసే సూచనలు లేవని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. వీటిని మరిపించే స్థాయిలో పైమూడు ఉంటేనే శనివారానికి థియేటర్లలో జనాన్ని చూడొచ్చు. మాములుగా డిసెంబర్ ని డ్రై సీజన్ గా భావించే టాలీవుడ్ కు ఈసారి ఒక నెల ముందే అలాంటి సీన్ కనిపిస్తోంది. బాక్సాఫీస్ చివరి వారం ఎలా ముగుస్తుందో చూడాలి.

This post was last modified on November 23, 2022 9:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టాక్ తేడాగా ఉన్నా కలెక్షన్లు అదిరిపోతున్నాయ్

కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…

22 minutes ago

బాలయ్యకు ‘జాట్’ ఫార్ములా వద్దు

ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…

48 minutes ago

అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…

1 hour ago

తెలివైన నిర్ణయం తీసుకున్న సారంగపాణి

ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…

3 hours ago

బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి…

3 hours ago

త‌మిళ‌నాడుకు మంచి రోజులు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవ‌డంపై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.…

4 hours ago