రామ్ గోపాల్ వర్మ తీస్తున్న పవర్ స్టార్ సినిమాలో ఏదైనా పనికొచ్చే విషయం ఉంటుందని ఇటీవల ఆర్జీవీ సినిమాలు చూస్తున్న వాళ్ళు, కాస్త బుర్ర ఉన్న వాళ్ళు ఎవరూ అనుకోరు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ నేతలను ట్రోల్ చేసాడో… ఇప్పుడు జనసేన అధ్యక్షుడిని, అతడి సేనని టార్గెట్ చేస్తున్నాడు. జనం పట్టించుకుంటారని అనిపించే అంశాన్ని తీసుకోవడం, దానికి తనకు తోచిన విధంగా పులిహోర కలపడం ఆర్జీవీకి అలవాటు.
పవర్ స్టార్ సినిమాలోనూ ఎలాంటి లోగుట్టులు ఉండవు. అందరికీ తెలిసిన ఒకటి రెండు అంశాలకు తన మార్కు పులిహోర కలిపి సినిమా తీసేస్తున్నాడు. ఈ సినిమా డిజిటల్ గా రిలీజ్ అవుతుంది కనుక రన్ టైం పరంగా ఇంత ఉండాలి అనే నిబంధనలు కూడా లేవు.
నగ్నం సినిమా అని చెప్పి 20 నిమిషాల నిడివి ఉన్న సాఫ్ట్ పోర్న్ ఎపిసోడ్ రిలీజ్ చేసి అది కొని చూసిన వాళ్ళను వెర్రోళ్లను చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవర్ స్టార్ సినిమా కూడా గంట నిడివికి మించి ఉండదని అంటున్నారు. అంతకు మించి కలపడానికి వర్మ దగ్గర చింతపండు, తాలింపు దినుసులు కూడా ఉండవు లెండి.
Gulte Telugu Telugu Political and Movie News Updates