మామూలుగా అయితే రొట్టి విరిగి నేతిలో పడుతుంది.. మరి మనోడు మోడ్రన్ జనరేషన్ కమెడియన్ కాబట్టి, బిస్కెట్ విరిగి తేనెలో పడిందని చెప్పుకోవాలి. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో విపరీతంగా పాపులర్ అయిన కమెడియన్ సుడిగాలి సుధీర్.. ఇప్పుడు తన సుడిని మార్చేసుకున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయ్. అయితే ఈ దెబ్బతో ఈ కామెడీ స్టార్ కూడా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడంటూ ఇప్పుడు ఒక న్యూస్ చెక్కర్లు కొడుతోంది.
ఈ మధ్య కాలంలో కొంతమంది యంగ్ హీరోలు భలే క్లిక్ అయ్యారు. కాకపోతే వాళ్ళు క్లిక్ అయిన వెంటనే తమ రెమ్యూనరేషన్‌ను కోటి రూపాయలకు చేశారు. అందుకు ఉదాహరణ కిరణ్ అబ్బవరం. రెండో సినిమా ఆడింది అనగానే పారితోషకం కోటి చేశాడంట. దానితో ఇప్పుడు కమెడియన్ సుధీర్ కూడా.. హీరో సుధీర్‌గా మారిపోయి.. కోటి డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. గతంలో కిరణ్ అబ్బవరం సినిమా సమ్మతమే.. ఫ్లాప్ అండ్ యావరేజ్ టాక్ మధ్య నలిగిపోతూ.. ₹5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత వచ్చిన నేను మీకు బాగా కావల్సిన వాడిని సినిమా కూడా అంతే.
ఇప్పడు సుధీర్ ‘గాలోడు’ సినిమా కూడా తొలి వీకెండ్లోనే ₹3 కోట్ల గ్రాస్ వసూళ్లతో షాకిచ్చింది. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. కలక్షన్లు మాత్రం మొత్తంగా ఒక ₹5 కోట్లు టచ్ అయ్యే ఛాన్సుంది. ఒకవేళ నిర్మాతలకు ఈ రెవన్యూ నుండి ₹3 కోట్లు షేర్ వస్తే.. మరో 3-4 కోట్లు రూపాయలు డిజిటల్, శాటిలైట్ రైట్స్ నుండి వచ్చే ఛాన్సుంది. అందుకే ఇప్పుడు ‘గాలోడు’ కూడా కోటి కావాలంటున్నాడని మార్కెట్లో టాక్ వినిపిస్తోంది.
This post was last modified on November 22, 2022 9:19 am
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…