Movie News

చరణ్ చేయబోయేది పెద్ది కథేనా

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టినా నెక్స్ట్ ప్రాజెక్టు కోసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చిన బుచ్చిబాబుకు నిరీక్షణకు తగ్గ ఫలితమే దక్కేలా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తన కొత్త సినిమా లాక్ అయినట్టేనని సమాచారం. అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు కానీ ప్రాధమిక అంగీకారం జరిగిపోయిందని అంటున్నారు. సతీష్ కిలారు అనే కొత్త ప్రొడ్యూసర్ దీంతో డెబ్యూ చేయబోతున్నాడు. మైత్రి మూవీస్ కి సన్నిహితుడు కావడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్న లాజిక్ లో నిజాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం.

ఇదంతా బాగానే ఉంది కానీ బుచ్చిబాబు ఇప్పుడు ఓకే చేయించుకుంది గతంలో తారక్ కు చెప్పిన పెద్ది(ప్రచారంలో తిరిగిన టైటిల్) కథేనా అనే ప్రశ్న మాత్రం సస్పెన్స్ గా మిగిలింది. స్పోర్ట్స్ టచ్ ఉన్న బ్యాక్ డ్రాప్ లో హీరో పాత్రతో డ్యూయల్ రోల్ చేయించేలా బుచ్చిబాబు డిఫరెంట్ గా రాసుకున్నాడని అప్పట్లోనే టాక్ వచ్చింది. కానీ చరణ్ ఇప్పుడు చేస్తున్న శంకర్ మూవీలో ఆల్రెడీ ద్విపాత్రానభినయం చేస్తున్నాడు. సో బ్యాక్ టు బ్యాక్ డబుల్ ఫోటో సినిమాలు ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి బుచ్చిబాబు ఫ్రెష్ గా వేరే స్క్రిప్ట్ చెప్పి ఉంటాడన్న మాట మెగా కాంపౌండ్ లో వినిపిస్తోంది.

ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న రామ్ చరణ్ అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక శంకర్ తో తిరిగి రానున్నాడు. బుచ్చిబాబుది ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాక తేలుతుంది. అటువైపు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కోసం ఇప్పటికే చాలా సమయం త్యాగం చేసి కొరటాల శివ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఆరేడు నెలలు వేచి చూశాడు. దీనికన్నా ముందు అనుకున్న త్రివిక్రమ్ ది క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు బుచ్చిబాబుది డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఏదైతేనేం కొత్త దర్శకుడికి మళ్ళీ మెగాహీరో దొరికాడు. అది కూడా చరణ్. ఇంకేం బూరెల బుట్టలో పడ్డట్టే.

This post was last modified on November 22, 2022 8:37 am

Share

Recent Posts

అసూయ పుట్టిస్తున్న అబ్బవరం

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినీ రంగంలో స్టార్ ఇమేజ్ సంపాదించడం చిన్న విషయం కాదు. సక్సెస్ రేట్ చాలా…

1 hour ago

సౌత్ దర్శకులకు హీరోయిన్ రంగు ముఖ్యమా?

దక్షిణాదిన కొన్ని సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్‌కు పరిమితం అవుతుంటారు కొందరు హీరోయిన్లు. బాలీవుడ్లో కెరీర్ పుంజుకున్నాక.. మళ్లీ…

3 hours ago

కోటి పారితోష‌కం గురించి మౌళిని అడిగితే…

గ‌త ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమాతో సంచ‌ల‌నం రేపాడు యువ న‌టుడు మౌళి. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టిన…

5 hours ago

రాజ‌మౌళి మ‌హాభార‌తం క‌ల ఈ నిర్మాత నిజం చేస్తాడా?

త‌న డ్రీమ్ ప్రాజెక్టు మ‌హాభారతం అని చాలా ఏళ్ల కింద‌ట్నుంచే చెబుతున్నాడు దర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ఆయ‌న ఆ సినిమా…

5 hours ago

పులివెందులలో జగన్ కొత్త సినిమా చూస్తారా?

ఔను... పులివెందులలో జగన్ కు కొత్త సినిమా చూపిస్తామంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలు…

5 hours ago

జనసేన – బీజేపీ అంతర్గత పొత్తు?

తెలంగాణ‌లో పోటీ చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిందా? రంగంలోకి దిగేందుకురెడీ అయిందా? అంటే…

6 hours ago