టాలీవుడ్ సంక్రాంతికి వారసుడు పెట్టిన చిచ్చు మాములుగా లేదు. ఒక తమిళ పార్టీ ఏమో తెలుగు సినిమాలు బ్యాన్ చేస్తామంటుంది. ఫామ్ లో లేని ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టరేమో వరిసుకు ముందు ఆ తర్వాత పరిణామాలు వేరే ఉంటాయంటూ వెరైటీ బెదిరింపులు చేస్తాడు. తీరా చూస్తే తమిళ స్టార్ హీరోలెవరూ ఆఫర్లు ఇవ్వకపోతే ఇక్కడికొచ్చి ఊపుమీదున్న కుర్ర హీరోకు డిజాస్టర్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఈయనది. ఇదంతా చూస్తూ తెలుగు సినిమా అభిమానులు ఊరుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను పబ్లిక్ గానే ప్రకటిస్తున్నారు. ఇది టూ మచ్ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు
నిజానికి డబ్బింగ్ రూపంలో తమిళ నిర్మాతలకు మన మార్కెట్ కల్పతరువు లాంటిది. విక్రమ్ అపరిచితుడు, సూర్య గజిని, శంకర్ బాయ్స్ లాంటివి ఒరిజినల్ వెర్షన్ కంటే ఏపీ తెలంగాణలోనే బ్రహ్మాండమైన వసూళ్లు దక్కించుకున్నాయి. అక్కడ రెండు వారాలకు చాప చుట్టేసిన వాటిని మనం ఆదరించిన ఉదంతాలున్నాయి. అంతెందుకు విజయ్ మొహమే సరిగా గుర్తు పట్టని తెలుగు జనాలు బాగానే ఉన్నాయనే కారణంతోనే కదా తుపాకీ, విజిల్, మాస్టర్ లాంటి వాటిని హిట్లు చేసింది. అదంతా మర్చిపోయి ఏదో అన్యాయం జరిగిపోతోందనే రేంజ్ లో శోకాలు పెట్టడం ఓవర్ డ్రామా.
వీటిని అడ్డుకునేదెవరంటే సమాధానం దొరకదు. డబ్బింగుల వర్షం పడుతూనే ఉంటుంది. ఈ శుక్రవారం లవ్ టుడేకి నాలుగు వందలకు పైగా థియేటర్లు రెడీ అయ్యాయి. వీకెండ్ కి మరింత పెరగొచ్చు. బాలీవుడ్ తోడేలుకి సైతం భారీ ప్లాన్ వేశారు. ఇంతే స్థాయిలో అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గంకు కేటాయిస్తారా అంటే డౌటే. ఇవన్నీ గమనించుకుంటే తమిళ బ్యాచు ఇంతగా పెట్రేగిపోవడానికి మనకు మనమే కారణంగా తోస్తోంది. కఠిన నిబంధనలు పెట్టుకుంటే తప్ప అనువాదాల ప్రవాహాన్ని ఆపడం కష్టమే. మరోవైపు విజయ్ ఫ్యాన్స్ ఏదో తమ హీరోకి అన్యాయం జరుగుతోందన్న రేంజ్ లో శోకాలు పెట్టడం అసలైన కామెడీ ట్విస్ట్.
This post was last modified on November 22, 2022 9:06 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…