ఏపీ సీఎం జగన్ తాజాగా నరసాపురంలో పర్యటించారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఇక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకు స్థాపన చేశారు. అయితే, ఈ సభలో మహిళలకు తీవ్ర అవమానం జరిగింది. నల్ల చున్నీలు ధరించివచ్చిన మహిళలను గేట్ వద్దే ఆపేశారు. వారి చున్నీలను బలవంతంగా తీయించివేశారు. దీనిపై మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులు చర్యను ప్రతిఘటించారు. అయినప్పటికీ పోలీసులు ససేమిరా అంటూ పోలీసులు తమ మాటనే నెగ్గించుకున్నారు.
స్వాధీనం చేసుకున్న చున్నీలను బారికేడ్‌ల కోసం ఏర్పాటు చేసిన కర్రలపై పడేశారు. వర్షం పడుతుందన్న భయంతో నల్ల గొడుగులు తెచ్చుకున్న మహిళలకు చేదు అనుభవమే మిగిలింది. గేటు వద్దే గొడుగుల్ని స్వాదీనం చేసుకున్నారు. ఇస్తేగాని లోనికి అనుమతించలేదు. దీంతో చాలామంది చేసేది లేక మహిళలు సభ వెళ్లారు. మరికొంత మంది ఇంటి ముఖం పట్టారు. ఇంతకి నల్ల రంగును చూసి పోలీసులు ఎందుకు భయపడ్డారంటే కొంత మంది జగన్ సభలో నిరసన వ్యక్తం చేస్తారేమోనని భయాందోళనకు గురయ్యారు.
దీంతో సీఎం సభకు హాజరుకావాలంటే తప్పనిసరిగా నల్ల చున్నీలు, ఓణీలు తీసిరావాలని పోలీసులు ఖరాఖండిగా చెప్పడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సీఎం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని,.. దయచేసి అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. పోలీసులు కుదరదని తేల్చి చెప్పడంతో.. తప్పని పరిస్థితుల్లో చున్నీలు బారికేడ్లపై వేసి లోపలి వెళ్లారు. భద్రతా సిబ్బంది తీరుపై మహిళా ఉద్యోగులు సైతం మండిపడ్డారు.
అందుకే తీసివేయించారట!
జగన్ మాట్లాడుతున్న సమయంలో నల్ల గొడుగులు, చున్నీలు పైకి ఎత్తుతారన్న ముందస్తు భయంతో స్వాదీనం చేసుకున్నామని పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే, ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మండిపడుతున్నారు.
This post was last modified on November 22, 2022 8:53 am
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…