సూపర్ స్టార్ కృష్ణ కొన్ని రోజుల కిందటే హఠాత్తుగా మరణించారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఒక్క రోజు వ్యవధిలో తుది శ్వాస విడిచారు. ఐతే కృష్ణ అనారోగ్యంతో ఉన్నట్లు ఈ మధ్య వార్తలేమీ రాలేదు. దీంతో ఇలా ఆయన హఠాత్తుగా ప్రాణాలు వదలడం ఏంటని అభిమానులు తీవ్ర మనో వ్యథకు గురయ్యారు. అసలాయనకు ఏం జరిగందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఇంతకీ కృష్ణ చనిపోవడానికి ముందు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన సోదరుడు ఆదిశేషగిరి రావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..
గత ఆదివారం పొద్దునే అన్నయ్య దగ్గరకు వెళ్లాను. రెండు గంటలకు పైగా అక్కడే ఉన్నాను. ఆయనకు ఏమనిపించిందో ఏమో మా చిన్నప్పటి సంగతులు చెబుతూ వచ్చారు. నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని సినిమాలకు తీసుకెళ్లిన రోజుల నుంచీ అన్నీ గుర్తు చేసుకున్నారు. ఇద్దరం నవ్వుకున్నాం. తర్వాత ఇప్పుడొస్తున్న సినిమాల గురించి కూడా కాసేపు చర్చించుకున్నాం. అప్పుడాయనకు అనారోగ్య లక్షణాలేవీ కనిపించలేదు. హుషారుగా ఉన్నారు. నన్ను ఆ రోజు అక్కడే భోజనం చెయ్యమన్నారు కానీ ఇంట్లో వేరే వాళ్లని లంచ్‌కి పిలవడంతో మళ్లీ వస్తానని వచ్చేశాను.
ఐతే ఆ రోజు రాత్రి భోంచేసి పడుకున్నాక రాత్రి పన్నెండున్నరకి గుండెపోటు వచ్చింది. అన్నయ్య రూం బయట ఓ కుర్రాడు రాత్రిళ్లు ఆయన్ని కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన గది తలుపు తెరిచే ఉంటుంది. అవసరం వస్తే పిలుస్తారు. అన్నయ్యకు గురక పెట్టే అలవాటు ఉంది. ఆ టైంలో గురక శబ్దం వినిపించక పోవడంతో ఆ కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేశాడు. ‘ఎర్రర్’ అని వచ్చింది. వాడికి భయం వేసి నాకు ఫోన్ చేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పి నేనూ అక్కడికి చేరుకున్నా. గుండెపోటు వచ్చిన 20 నిమిషాల లోపు వైద్యం అంది ఉంటే కొంత ఫలితం ఉండేది. ఆలస్యం కావడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది రక్త ప్రసరణ ఆగిపోయింది. దాదాపు 30 గంటలు డాక్టర్లు అన్నయ్యను బతికించడానికి పోరాటం చేశారు కానీ రెండోసారి గుండెపోటు రావడంతో ఫలితం లేకపోయింది అని ఆదిశేషగిరి రావు వివరించారు.
This post was last modified on November 20, 2022 8:43 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…