సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి ముప్పై రోజులు గడచింది. అతని ప్రేయసిగా రియా చక్రవర్తి పేరు ఆరోజునుంచి మీడియాలో, సోషల్ మీడియాలో నలుగుతూనే ఉంది, అయితే ఆమె పబ్లిక్ గా రియాక్ట్ అవడానికి ఇష్టపడలేదు. నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరమయిన రియా ఇక స్పందించక తప్పలేదు.
తన రెగ్యులర్ అప్డేట్స్ పెడితే ఫాన్స్ తో పాటు మీడియా కూడా ఉతికి ఆరేస్తుంది. అందుకే ముందుగా సుశాంత్ గురించే ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తమ ప్రేమ సంగతిని మొదటిసారి తనంతట తానుగా తెలియజేయడమే కాకుండా, సుశాంత్ లేని లోటు ఎంత వేధిస్తోందో చెప్పుకొచ్చింది. సెలెబ్రిటీలు, స్నేహితులు ఆమెకు ఓదార్పు అందిస్తున్నారు.
అయితే సుశాంత్ అభిమానులు మాత్రం ఆ పోస్ట్ తో కరగలేదు. ఆమెపై తిట్ల దండకం అందుకున్నారు. కామెంట్స్ లిమిట్ చేయని రియా ఓపికగా పలు కామెంట్స్ డిలీట్ చేస్తోంది. కానీ ఫాన్స్ నుంచి వస్తున్న నిరసన ఆగడం లేదు. సుశాంత్ తో అసలు సంబంధం లేని వారినే ఎటాక్ చేస్తున్న ఫాన్స్ ఇక అతని గర్ల్ ఫ్రెండ్ ని వదిలిపెడతారా? కాకపోతే ఈ దాగుడుమూతలు ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు కదలాలి కనుక రియా ధైర్యం చేసేసినట్టుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates