కాస్త డిమాండ్ ఉన్న ప్రతి సీజన్‌కూ చాలా ముందుగానే బెర్తులు బుక్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. సంక్రాంతికి ఐదారు నెలల ముందే రిలీజ్ డేట్లు ఖరారవుతుంటాయి. ముందు డేట్లు ఇచ్చేసి తర్వాత అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటారు. వేసవి విషయంలోనూ అంతే. ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే వేసవిలో దాదాపు ప్రతి వారానికీ సినిమాలు ఖరారైపోవడం విశేషం.
ఐతే చాలాముందుగా సమ్మర్ రేసులోకి వచ్చిన ‘సలార్’, మహేష్-త్రివిక్రమ్ మూవీ ఆ టైంలో రిలీజ్ కావడం లేదు. సలార్ ఆల్రెడీ వచ్చే ఏడాది ద్వితీయార్దానికి వాయిదా పడింది. మహేష్-త్రివిక్రమ్ సినిమా రకరకాల కారణాల వల్ల సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరుగుతోంది. కాబట్టి అది కూడా వేసవికి రాదు. వీటిని పక్కన పెడితే మార్చి మూడో వారంలో ‘డీజే టిల్లు-2’తో సమ్మర్ సందడి మొదలవుతుంది. ఆ నెల చివర్లో నాని సినిమా ‘దసరా’ వస్తుంది.
ఏప్రిల్ 7కు రవితేజ సినిమా ‘రావణాసుర’ షెడ్యూల్ అయి ఉంది. ఇంకో వారానికి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 14న ఆ సినిమా రిలీజయ్యే రోజే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్’ను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అది తమిళ సంవత్సరాది రోజు కాబట్టి ప్రతి ఏడాదీ భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. వచ్చే ఏడాదికి ‘జైలర్’ వస్తుందంటున్నారు. ఇక విక్రమ్ ప్రభు డైరెక్షన్లో నాగచైతన్య చేస్తున్న ద్విభాషా చిత్రాన్ని ఏప్రిల్ 22న రిలీజ్ చేయాలని ప్రాథమికంగా అనుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.
ఇక వేసవిలో రాబోయే అత్యంత భారీ చిత్రం అంటే ‘హరి హర వీరమల్లు’నే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30కి అనుకుంటున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడొచ్చు. కానీ సమ్మర్‌ను దాటి అయితే వెళ్లే అవకాశం లేదు. సమంత త్వరగా షూటింగ్‌కు రాగలిగితే విజయ్ దేవరకొండతో ఆమె చేస్తున్న ‘ఖుషి’ పూర్తయి మేలో రిలీజయ్యే అవకాశముంది. రామ్-బోయపాటి చిత్రాన్ని కూడా వేసవికే రిలీజ్ చేసే అవకాశముంది. ప్రస్తుతానికి వేసవికి పక్కాగా అనిపిస్తున్న సినిమాలివే.
This post was last modified on November 19, 2022 8:48 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…