Movie News

భోళా శంకర్ కు జైలర్ సవాల్

బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ తలపడిన సందర్భాలు లేవు. అందులోనూ ఒకే రోజు నువ్వా నేనా అంటూ ఢీ కొట్టిన దాఖలాలు కనిపించవు. కానీ 2023లో మాత్రం ఇది తప్పేలా లేదు. భోళా శంకర్ ఏప్రిల్ 14 విడుదల తేదీగా ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడంటే వాల్తేర్ వీరయ్య కోసం బ్రేక్ ఇచ్చారు కానీ రిలీజ్ డేట్ ని టార్గెట్ పెట్టుకుని దర్శకుడు మెహర్ రమేష్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. అజిత్ తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మీద ఫ్యాన్స్ కి ఏమంత ఆశలు లేవు కానీ రమేష్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

తాజాగా రజని నటిస్తున్న జైలర్ ని సైతం ఏప్రిల్ 14నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెన్నై టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో డాక్టర్, బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ మూవీలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్ర చేయడం లాంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. పేట తర్వాత అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న తలైవర్ మూవీ కూడా ఇదే. వరసగా ఎన్ని డిజాస్టర్లు పడుతున్నా అంచనాల విషయంలో తగ్గేదేలే అంటూ రేంజ్ మైంటైన్ చేస్తున్న రజని కుర్ర దర్శకులతో వరసగా జోడి కడుతూనే ఉన్నారు

ఇంకా అయిదు నెలల సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగొచ్చు కానీ ఇంత అడ్వాన్స్ గా రిలీజ్ డేట్లు చెప్పుకుంటే తప్ప సాఫీగా విడుదల కాని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇలా చేయడం మంచిదే. రోబో తర్వాత ఆ స్థాయి హిట్టు తెలుగులో లేక రజని మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. మరోవైపు చిరంజీవి సైతం ఖైదీ నెంబర్ 150 తర్వాత అంత విజయం మళ్ళీ అందుకోలేదు. సైరా ఓవరాల్ గా నష్టాలు తేగా, ఆచార్య డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ తోనూ యావరేజ్ కావడం లాంటివి జరిగాయి. వాల్తేర్ వీరయ్య హిట్టు కొట్టే తీరాలి. ఆపై భారం భోళా శంకర్ మీద ఉంటుంది. మరి ఈ వెటరన్ హీరోల వార్ ఎలా ఉండనుందో.

This post was last modified on November 18, 2022 10:11 am

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

3 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

10 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

11 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

11 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

11 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

13 hours ago