Movie News

ఇప్పుడు సినిమా తియ్యకండి సార్ ప్లీజ్

ఢిల్లీలో ఒక ఆగంతకుడు తన ప్రేయసిని చంపేసి 35 ముక్కలు చేసి.. మూడ్నెళ్ళు ఫ్రిజ్‌లో ఉంచి.. తరువాత ఒక్కో శరీరభాగాన్ని ఒక్కోచోట పడేయటం అనేది పెద్ద సంచలనమే. దీన్ని క్యాష్ చేసుకుంటున్న టివి ఛానల్స్ ఆల్రెడీ రోజూ ఈ న్యూస్‌‌పైన స్పెషల్ స్టోరీలు వేసుకుంటూ టి.ఆర్.పి.లు పెంచుకుంటున్నాయ్. ఏ చిన్న క్లూ గురించి ఇన్ఫర్‌మేషన్ దొరికినా కూడా.. వెంటనే దానిని భూతద్దంలో చూపించేసి, సదరు క్రైమ్ గురించి భయంకరమైన స్టోరీలు వేస్తున్నాయ్. సరే, పబ్లిక్‌కు మ్యాటర్ తెలియాలి కాబట్టి, చూపించడంలో తప్పే లేదు. కాని రామ్ గోపాల్ వర్మ వంటి డైరక్టర్లు ఈ బ్రూటల్ మర్డర్ గురించి ప్రస్తావిస్తుంటే మాత్రం భయం వేస్తోంది.

”దేవుడికి నేను చేసుకునే విన్నపం ఏంటంటే.. కఠినమైన చట్టాలు ఉన్నంతమాత్రాన కరుడుగట్టిన నేరస్తులు నేరాలు చేయడం మానేయరు. అదే చనిపోయినవారి ఆత్మలు తిరిగొచ్చి వీళ్ళని చంపేస్తే మాత్రం భయం ఉంటుంది” అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ వేశాడు. దీన్ని చూస్తుంటే మాత్రం, వర్మ ఏదో సలహా ఇచ్చినట్లు లేదు, ఈ ఇన్సిడెంట్‌ను వాడుకుని తను తీయబోతున్న సినిమా తాలూకు లైన్ చెబుతున్నట్లుంది. అందుకే ఇప్పుడు ఆ ట్వీట్ చూసినవారందరూ.. దయచేసి మీరు ఈ టాపిక్ మీద సినిమా తియ్యకండి సార్ అంటూ వర్మను రిక్వెస్ట్ చేస్తున్నారు.

అప్పట్లో తన ప్రియుడు నీరజ్ గ్రోవర్.. మారియా సుసైరాజ్ అనే నటీమణి ఘోరంగా చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఇలాగే ప్యాక్ చేసి పాడేసింది. ఈ టాపిక్ తీసుకుని, ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అంటూ రాము సినిమా తీసేశాడు. ఆ తరువాత నల్గొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ హత్యోదంతాన్ని కూడా మనోడు సినిమా రూపంలో తెరకెక్కించేశాడు. అలాగే హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సామూహిక రేప్ ఇన్సిడెంట్‌ను కూడా సినిమాగా మార్చేశాడు. ఈ సినిమా వలన ప్రజలకు కలిగే ఎంటర్టయిన్మెంట్ ఏంటో రామూకే తెలియాలి కాని.. అనవసరంగా ఆడియన్స్ మాత్రం భయపడే ఛాన్సుంది. కాబట్టి వర్మ ఈ కొత్త మర్డర్‌ను ప్రశాంతంగా వదిలేయాలని జనాలు కూడా కోరుకుంటున్నారు.

This post was last modified on November 17, 2022 11:51 am

Share

Recent Posts

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

1 hour ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

1 hour ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

2 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

3 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

14 hours ago