టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన హీరో. తెలుగు ప్రేక్షకులకి ఆయన మరచిపోలేని ఎన్నో సినిమాలను అందించారు. చూడగానే అందమైన చిరునవ్వుతో ఎల్లప్పుడూ ఆకట్టుకునే కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకున్న స్టార్ హీరోలలో ఒకరు. దాదాపు ఆయన 300కు పైగా సినిమాల్లో నటించారు.
కృష్ణగారు ఒక ఏడాదిలో 18 సినిమాలు కూడా చేశారు. ఒకరోజులో 16 గంటల నుంచి 18 గంటలు వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక 1965లో తేనెమనసులు సినిమా ద్వారా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఆడిషన్స్ లో కృష్ణ ఫొటోస్ పంపగానే ఒక ఇంటర్వ్యూ టెస్ట్ తో హీరోగా ఫిక్స్ అయ్యాడు.
అయితే ఒక ఇంటర్వ్యూలో కృష్ణ తన మొదటి రెమ్యునరేషన్ గురించి వివరణ ఇచ్చారు. తేనె మనసులు సినిమా కోసం నేను అందుకున్న మొదటి రెమ్యునరేషన్ రూ.2000 మాత్రమే అని చెప్పారు. అప్పట్లో అది పెద్ద ఎమౌంట్ అని కూడా అన్నారు. ఇక ఇప్పట్లో చాలామంది హీరోలు ఒక సినిమా సక్సెస్ కాగానే కోట్లల్లో రెమ్యునేషన్స్ పెంచుతున్నారని అన్నారు.
అయితే అప్పట్లో మాత్రం తాను వరుసగా విజయాలు అందుకున్నప్పటికీ కూడా 30-40 సినిమాల వరకు రూ.5000 రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా గుర్తుచేశారు. ఇక మొదటి సినిమా ఆడిషన్ సమయంలో కొంతమంది సినిమా తారలు కూడా పాల్గొన్నారట. అందులో కృష్ణంరాజు అలాగే మరికొందరు ఉన్నప్పటికీ ఆధూర్తి సుబ్బారావు గారు తననే మొదటి హీరోగా ఫిక్స్ చేసుకున్నట్లు కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.